Moviesపండగ పూట మెగా ఫ్యామిలీకి షాకిచ్చిన నీహారిక.. ఫ్యాన్స్ అస్సలు ఊహించలేదుగా.!

పండగ పూట మెగా ఫ్యామిలీకి షాకిచ్చిన నీహారిక.. ఫ్యాన్స్ అస్సలు ఊహించలేదుగా.!

రీసెంట్గా దివాలి సెలబ్రేషన్స్ మెగా ఫ్యామిలీ ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుందో మనం చూసాం . మరీ ముఖ్యంగా కొత్త కోడలు వచ్చాక మెగా ఫ్యామిలీ ఇంట జరిగిన ఫస్ట్ పండగ ఇదే కావడంతో అభిమానులు సైతం దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈసారి మెగా ఫ్యామిలీ దీవాళిని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది , నాగబాబు కుటుంబం చాలా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.

నాగబాబు ఫ్యామిలీ దివాళి సెలబ్రేషన్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ పిక్చర్స్ లో నాగబాబు భార్య పద్మ కొత్త కోడలు లావణ్య – వరుణ్ ఒకే కలర్ అవుట్ ఫిట్ లో మెరిసారు . చూడడానికి చాలా చాలా ట్రెండీగా స్టైలిష్ గా ఉంది . అయితే నాగబాబు – నిహారిక మాత్రం వేరే కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం అభిమానులకు అంతగా నచ్చలేదు . అంతేకాదు శుభ్రంగా అన్నా – వదిన- అమ్మతో పాటు నువ్వు కూడా మంచి కాంబినేషన్ శారీ కట్టుకోవచ్చుగా అంటూ నిహారికను ఏకేస్తున్నారు.

మరికొందరు పానకంలో పుడకలా వాళ్ళ మధ్య నువ్వు ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం స్ట్రైట్ గా అసలు నిహారిక ని మెగా ఫ్యామిలీ దూరం పెట్టేసింది అని .. అందుకే ఆమె విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు అని ఘాటుగా బదులుఇస్తున్నారు . మొత్తానికి పండగ పూట కూడా నిహారికని వదలకుండా కావాలనే కొందరు పనికట్టుకొని ట్రోల్ చేస్తున్నారు అనే విషయం మాత్రం క్లారిటీ వచ్చేసింది.

అయితే నిహారిక కూడా ఇలా రెడ్ కలర్ శారీ కాకుండా అన్న వదినలకు మ్యాచ్ అయ్యే కలర్ శారీ కట్టుకొని ఉంటే ఇంకా బాగుండేది అంటున్నారు అభిమానులు . నిహారిక దగ్గర నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news