Moviesసుకుమార్ కి ఉన్న ఆ పాడు జబ్బే రాజమౌళి కి ఉందా..?...

సుకుమార్ కి ఉన్న ఆ పాడు జబ్బే రాజమౌళి కి ఉందా..? దొందు దొందే రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోలే కాదు డైరెక్టర్లు కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . హీరోలకి మించిపోయిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకొని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు . ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ఎవరు అంటే వినిపించేది రెండే రెండు పేర్లు ఒకటి రాజమౌళి రెండు సుకుమార్ . వీళ్ళిద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే .

ఇద్దరు డైరెక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే రాజమౌళి సుకుమార్ లో ఉన్న ఓ కామన్ పాయింట్ ఇప్పుడు అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు . రాజమౌళి తాను అనుకున్న సీన్ వచ్చేవరకు నటీనటులను ఎంత ఇబ్బంది పెడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఈ విషయాన్ని స్వయాన యాక్టర్స్ చెప్పుకొచ్చారు. అయితే అదే జబ్బు సుకుమార్ కి కూడా ఉందట . ఆయన అనుకున్న సీన్ గాని ఎక్స్ప్రెషన్ గాని రాకపోతే..అది వచ్చేవరకు పదేపదే టేక్స్ అంటూ వాళ్ళను బాగా హింసిస్తారట. పుష్ప సినిమాలో రష్మిక – అల్లు అర్జున్ సైతం అలాగే టార్చర్ చేశారట . దీంతో వీళ్ళిద్దరికీ ఈ క్వాలిటీ పిచ్చి ఏంట్రా బాబు అంటూ జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు .అంతేకాదు అలా కమిట్మెంట్ ఉండడం కారణంగానే వీళ్ళిద్దరూ టాప్ డైరెక్టర్లుగా మారారు అంటూ కూడా చెబుతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news