Newsఈ ఫొటోలో స‌చిన్‌తో ఉన్న టాలీవుడ్ క్రేజీ హీరో ఎవ‌రో గుర్తు...

ఈ ఫొటోలో స‌చిన్‌తో ఉన్న టాలీవుడ్ క్రేజీ హీరో ఎవ‌రో గుర్తు ప‌ట్టారా… అదే ట్విస్ట్‌…!

ప్ర‌స్తుతం న‌డుస్తోంది అంతా సోష‌ల్ మీడియా యుగం. హీరో, హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియా బ‌య‌ట‌కు వ‌స్తే చాలు బాగా వైరల్ అవుతూనే ఉంటాయి. నెట్టింట ఫ్యాన్స్ తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్న‌నాటి ఫొటోలు, ఫ్యామిలీ ఫొటోల‌ను బాగా పోస్ట్ చేస్తూ ట్రెండింగ్ చేస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే పై ఫొటోలో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ చేతుల్లో ఉన్న ఆ చిన్నారి బుడ‌త‌డు కూడా మ‌న టాలీవుడ్ స్టార్ హీరో.. ఇప్పుడు ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

ఇంత‌కు ఆ ఫొటోలో ఉన్న ఆ హీరో ఎవ‌రో గుర్తు ప‌ట్టారా ? ఇప్ప‌టికే టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలిసినిమాతోనే సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. మ‌నోళ్లు ఆ కుర్ర హీరోను టాలీవుడ్ హృతిక్ రోషన్ అని కూడా పిలుస్తుంటారు. పైగా అత‌డి త‌ల్లిదండ్రులు ఇద్ద‌రు కూడా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లే కావ‌డం విశేషం.

ఇంత‌కు ఆ హీరో ఎవ‌రో కాదు సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ మేకా. రోష‌న్ తండ్రి సీనియర్ శ్రీకాంత్ ఫ్యామిలీ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. అదే టైంలో త‌న‌తో క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించిన అప్ప‌టి హీరోయిన్ ఊహాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక రోష‌న్ నాగార్జున నిర్మించిన నిర్మల కాన్వెంట్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యాడు.

ఆ సినిమా అంచ‌నాలు అందుకోలేదు. ఆ త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకుని రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వ‌చ్చిన పెళ్లిసంద‌డి సినిమాలో న‌టించి సూప‌ర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఇక ఇప్పుడు రోష‌న్ వృష‌భ అనే టైటిల్‌తో మ‌రో సినిమా చేస్తున్నాడు. అలాగే వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్లో మ‌రో సినిమాకు కూడా ఓకే చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news