News"అలా చేస్తే అలియా నన్న చావ కొడుతుంది"..సిగ్గు లేకుండా పచ్చిగా చెప్పేసిన...

“అలా చేస్తే అలియా నన్న చావ కొడుతుంది”..సిగ్గు లేకుండా పచ్చిగా చెప్పేసిన రణ్ బీర్ కపూర్..!!

ప్రెసెంట్ సినీ లవర్స్ అందరి కళ్ళు యానిమల్ సినిమా పైన పడి ఉన్నాయి. అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా యానిమల్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తూ ఉండగా రష్మిక మందన్నా.. హీరోయిన్ గా నటిస్తుంది . డిసెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

సినీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ . ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది . ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో రన్బీర్ హీరోయిన్ రష్మిక డైరెక్టర్ సందీప్ రెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు . ఈ క్రమంలోనే ఈవెంట్లో మాట్లాడుతూ రణ్బీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

“ఈ పాత్రలో నేను ఇదివరకు ఎప్పుడూ నటించలేదు ..కచ్చితంగా కొందరు లేడీస్ కి నా పాత్ర నచ్చదు.. నేను ఒకవేళ ఇంటికెళ్లి ఈ పాత్రలో బిహేవ్ చేసినట్లు బిహేవ్ చేస్తే నా భార్య నన్ను తంతుంది ..అందుకే నేను ఎప్పుడూ అలా చేయను ..ఇది కేవలం నా పాత్రలో వరకే పరిమితం “అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు . అయితే భార్యాభర్తల మధ్య విషయాలను ఇలా ఓపెన్ గా పబ్లిక్ ఈవెంట్ లో చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news