Newsఅర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్రకి..యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రకి అదే...

అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్రకి..యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రకి అదే తేడా గమనించారా..?

ప్రజెంట్ సినీ లవర్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్న సినిమా యానిమల్. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తూ ఉండగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సినీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్గా రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రైలర్ చాలా అద్భుతంగా అభిమానులను ఆకట్టుకుంటుంది . అయితే ఈ ట్రైలర్ లో రష్మిక పాత్ర కొంచెం సేపే చూపించిన చాలా ఎఫెక్ట్ గా చూపించాడు సందీప్ రెడ్డివంగా .నిజానికి అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్రలో నటించిన షాలినీ పాండేకు అనిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో కనిపించిన రష్మిక కు చాలా వేరియేషన్ ఉంది.

ప్రీతి తన కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుని కూల్ గానే మాట్లాడుతుంది . అయితే గీతాంజలి పాత్ర నటించిన రష్మికను మాత్రం చాలా వైల్డ్ యాంగిల్ లో చూపిస్తాడు సందీప్ రెడ్డివంగా . అమ్మాయిలలో సాఫ్ట్ నేచర్ హార్డ్ నేచర్ రెండు ఉంటుంది అని చెప్పడానికి ఆయన ఈ విధంగా క్యారెక్టర్స్ డిజైన్ చేశాడు అన్న కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news