Newsబిగ్ బ్రేకింగ్: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. మన జూనియర్ బాలయ్య...

బిగ్ బ్రేకింగ్: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. మన జూనియర్ బాలయ్య ఇక లేరు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక స్టార్ సెలబ్రిటీ మరణించారు అన్న వార్త విని ఆ విషాదఛాయలు మరవకముందే మరో స్టార్ సెలబ్రిటీ ఇండస్ట్రీలో మరణిస్తూ ఉండడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు . ఇలా వెంట వెంటనే విషాద వార్తలు విని అభిమానులు కుమిలి కుమిలి ఏడుస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది .

తమిళ చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ నటుడు కమెడియన్ అయినా టీఎస్ బాలయ్య కుమారుడు జూనియర్ బాలయ్య మృతి చెందారు . దీర్ఘకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు పరిస్థితి విషమంతో ఆయన తుది శ్వాస విడిచాడు . చెన్నైలోని ఆయన వలసరవక్కం నివాసంలో జూనియర్ బాలయ్య మృతి చెందాడు . ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

నిజానికి ఆయన అసలు పేరు రఘు బాలయ్య . అభిమానుల ముద్దుగా జూనియర్ బాలయ్య అని పిలుచుకుంటూ ఉంటారు . తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలు నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు . 1975లో జూనియర్ బాలయ్య మీనాట్టు మురుమగాళ్ చిత్రంతో కెరీర్ ప్రారంభించారు . ఆయన చివరిగా నటించిన చిత్రం అజిత్ నేరకొండ పార్వై . జూనియర్ బాలయ్య ఇక లేడు అన్న విషయం తెలుసుకుని ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు . జూనియర్ బాలయ్య మృతి తో తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. గురువారం రోజు సాయంత్రం ఆయన అంతక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యుల వివరించారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news