Newsటాలీవుడ్‌లో మ‌రో వార్‌.. దిల్ రాజు vs నాగ‌వంశీ... త‌గ్గేదేలే అంటోన్న...

టాలీవుడ్‌లో మ‌రో వార్‌.. దిల్ రాజు vs నాగ‌వంశీ… త‌గ్గేదేలే అంటోన్న నాగ‌వంశీ…!

టాలీవుడ్ లో ఒకేసారి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు థియేటర్ల కోసం నిర్మాతలు యుద్ధాలు చేస్తున్నారు. చివరకు డిస్కషన్లు నడుస్తున్నాయి.. రాజీ జరుగుతోంది. అయితే రిలీజ్ కు రెండు నెలల ముందు నుంచి ఎవరు వెనక్కు తగ్గం అంటూ గొప్ప గొప్పగా డాంబికాలకు పోతూ ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. ఈ యేడాది వాల్తేరు వీర‌య్య‌, వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చివరకు అందరూ రాజీకి వచ్చారు..

ఇక ఇప్పుడు సంక్రాంతికి కూడా అదే సమస్య మొదలవుతుంది. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా వస్తోంది. ఈ సినిమాకు సూర్యదేవర నాగ వంశీ నిర్మాత. సంక్రాంతికే రవితేజ ఈగిల్ సినిమా కూడా ఉంది. అటు దిల్ రాజు – విజయ్ దేవరకొండ – పరశురాం కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా సంక్రాంతి రేసులోనే ఉంది. ఫ్యామిలీ స్టార్ సినిమాకు దిల్ రాజు బ్యాగ్రౌండ్ ఉంది. గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్ సూర్యదేవర నాగవంశీ ఉండనే ఉన్నారు.

అలాగే హనుమాన్ – రవితేజ ఈగిల్ – నాగార్జున నా సామి రంగ సినిమాలు కూడా ఉండనే ఉన్నాయి. థియేటర్ల కోసం ఇక్కడ కూడా గొడవలు జరిగేలా ఉన్నాయి. పైగా వెంకటేష్ సైంధవ సినిమా కూడా సంక్రాంతికి వస్తోంది. ఆ సినిమాకు సురేష్ బాబు – ఏసియన్ సునీల్ థియేటర్లు వెళ్లిపోతాయి. ఇదే జరిగితే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు అనుకున్న స్థాయిలో థియేటర్లు దక్కవు. ఆ సినిమా కేవలం తెలుగులోనే రిలీజ్ అవుతుంది.

ఏపీ, తెలంగాణలోనే 120 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ సినిమాకు రెండు వందల కోట్ల వసూళ్లు రావాలి. ఎంత మంచి టాక్ ఉన్నా అంత పోటీలో ఈ స్థాయిలో వసూలు వస్తాయా ? అన్న సందేహం ఉంది. గుంటూరు కారంతో పాటు వెంకటేష్ సైంధవ – రవితేజ ఈగిల్ – విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్లలో ఏ సినిమా క్లిక్ అయినా గుంటూరు కారం వసూళ్లపై గట్టి ప్రభావం పడుతుంది. అసలే సినిమా కింద మీద పడుతూ నడుస్తోంది.. నిర్మాతలు చెబుతున్న బేరాలు ఎక్కడా తెగట్లేదు.

ఇదిలా ఉంటే ఇంత‌లోనే గుంటూరు కారం నిర్మాత నాగ‌వంశీ చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కాంట్ర‌వ‌ర్సీ లేపాయి. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో క్రేజీ కాంబినేషన్ గుంటూరు కారం సినిమాయే.. మిగిలిన వాళ్ళు థియేటర్ల కోసం డిస్కషన్లకు తమ దగ్గరికి రావాలి అని నాగవంశీ అనటం సరికాదని ఇండస్ట్రీ జనాలు కూడా కాస్త రుసరుసలాడుతున్నాడు. మీడియా థియేటర్ల సమస్య మీద డిస్కస్ చేస్తున్నారా ? అని అడిగితే కూర్చుని మాట్లాడుకుంటాం అంటే సరిపోయేది. అలాకాకుండా పండగ సినిమాల్లో ముందుగా ఏదీ చూడాలనుకుంటున్నారు ? గుంటూరు కారం సినిమాయే కదా అందువల్ల మిగిలిన వాళ్ళు వచ్చి మాట్లాడాలి కానీ.. తాను ఎందుకు వెళ్లి మాట్లాడతా అనే నాగ వంశీ బదులిచ్చారు.

ఎంత గొప్ప సినిమా అయినా అది ఓపెనింగ్ వరకే ఉంటుంది.. ఒక్కసారి టాక్ బయటకు వచ్చాక ప్రేక్షకులు ఆ సినిమాను చూడాలా వద్దా ? అని డిసైడ్ చేస్తారు. తక్కువ కాంబినేషన్ అనుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.. గొప్ప కాంబినేషన్ అనుకున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.. ఈ లాజిక్ తెలిసి కూడా నాగవంశీ తమ సినిమాయే గొప్ప అన్నట్టుగా మాట్లాడటం చాలామందికి రుచించడం లేదు. ఇది పరోక్షంగా దిల్ రాజు కూడా తమ దగ్గరికి రావాలి అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టు ఉందని కూడా కొందరు చర్చిస్తున్నారు. నాగ‌వంశీ వ్యాఖ్య‌లు సంక్రాంతి సినిమాల థియేట‌ర్ల వార్‌ను మ‌రింత ముదిరేలా చేస్తున్న‌ట్టుగా కూడా ఉంద‌ని కొంద‌రు అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news