Newsటాలీవుడ్ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేసిన బాల‌య్య‌... !

టాలీవుడ్ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేసిన బాల‌య్య‌… !

నట‌సింహం బాలకృష్ణ నిజంగానే టాలీవుడ్ లో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి పడేసాడు. తాజాగా ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన భగవంత్ కేసరి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అఖండ, వీర సింహారెడ్డి తర్వాత ఇది బాలయ్యకు వరుసగా మూడో విజయం. టాలీవుడ్‌కు అక్టోబర్ నెల అంటేనే పెద్దగా కలిసి రాని నెలగా గుర్తింపు తెచ్చుకుంది. గత మూడేళ్లుగా ఇదే ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది అక్టోబర్ నెలలో చెప్పుకోవటానికి మాత్రం ఒక హిట్ సినిమా వచ్చింది.

అదే భగవంత్ కేసరి. అక్టోబర్ మొదటి వారంలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన మ్యాడ్, మామా మచ్చింద్ర, 800 రెంజల్ లాంటి సినిమాలు వచ్చాయి. ఒక్క మ్యాడ్ సినిమా మాత్రమే చిన్న సినిమాగా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. సుదీర్ బాబు మామా మ‌చ్చింద్ర, కిరణ్ అబ్బవరం రూల్స్ రంజాన్ ఫ్లాప్ అయ్యాయి. అక్టోబర్ రెండో వారంలో పది సినిమాలు రిలీజై అన్ని డిజాస్టర్లు అయ్యాయి.

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ, సగిలేటి కథ, రాక్షస కావ్యం సినిమాలు అన్ని ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇక అక్టోబర్ మూడో వారంలో బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో సినిమాలు పోటీపడ్డాయి. వీటిలో భగవంత్ కేసరి సక్సెస్‌ఫుల్గా నిలబడింది. ఈ సినిమా దసరా విన్నర్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అంచనాలు అందుకోలేదు. సెకండ్ హాఫ్ నీరసంగా ఉండడంతో పాటు భారీ రన్ టైం రవితేజ సినిమాను దెబ్బతీసింది.

సితార ఎంటర్టైన్మెంట్ అండతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదలైన విజయ్ లియో సినిమా యూత్‌ను ఎట్రాక్ట్ చేసింది. మరీ కమలహాసన్, విక్రమ్ రేంజ్ లో కాకపోయినా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. దసరా తర్వాత మళ్లీ ప్లాపులు పలకరించాయి. సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్, లింగోచ్చా సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఈ నెలలో వచ్చిన ప్రభాస్ రీ రిలీజ్ ఛత్రపతి కూడా ప్లాప్ అయ్యింది. ఓవరాల్‌గా అక్టోబర్ నెలలో 27 సినిమాలు వస్తే మూడు మాత్రమే హిట్ అయ్యాయి. అందులో భగవంత్‌ కేసరి ఈ నెల విన్నర్‌గా నిలవగా… నితిన్ మ్యాడ్‌, విజ‌య్ లియో సినిమాలు హిట్ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news