Newsబాల‌య్య - ర‌వితేజ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తా అంటోన్న టాలీవుడ్ స్టార్...

బాల‌య్య – ర‌వితేజ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తా అంటోన్న టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌..!

నటసింహం – మాస్ రాజాలు కలిసి సినిమా చేస్తే ఎలా ? ఉంటుంది.. టాలీవుడ్ బాక్సాఫీస్ అదిరిపోతుంది. నట‌సింహం బాలకృష్ణ, మాస్ మహారాజ్ రవితేజ కలిసి అన్‌స్టాపబుల్ టాక్ షోలో ఎపిసోడ్ చేస్తేనే అదిరిపోయింది. గత కొన్ని నెలల నుంచి వీరిద్దరి మధ్య సరైన సంబంధాలు లేవన్న పుకార్లకు ఆ షోతో చెక్ పెట్టేశారు. అలాగే భవిష్యత్తులో తాము ఇద్దరం కలిసి పని చేసే అవకాశాలు ఉన్నాయన్న హింట్ కూడా ఇచ్చేశారు. ఈ షో తర్వాత రవితేజ – చిరంజీవి కలిసి వాల్తేరు వీరయ్య మల్టీస్టారర్ సినిమా చేశారు.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇటు బాలయ్య కూడా మూడు వ‌రుస‌ సూపర్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. తాజాగా దసరాకు బాలయ్య భగవంత్‌ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలలో బాలయ్య సినిమా ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసింది. రవితేజ టైగర్ నాగేశ్వరరావుకు అనుకున్న టాక్‌ రాకపోయినా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో మల్టీస్టారర్ సినిమా వస్తే ఎలా..? ఉంటుంది. ఇప్పుడు అదే జరిగే ఛాన్సులు అయితే ఉన్నాయి.

రవితేజ – బాలయ్య ఇద్దరు ఎవరి సినిమాలలో వారు బిజీబిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరితో మంచి రిలేషన్ ఉన్న దర్శకుడు మలినేని గోపిచంద్.. రవితేజకు డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి మూడు సూపర్ హిట్‌లు ఇచ్చారు. అలాగే బాలయ్యకు వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. వీర సింహారెడ్డి తర్వాత బాలయ్య గోపీచంద్ కు మరో ఛాన్స్ ఇస్తానని చెప్పేశారు. ఇప్పుడు రవితేజ.. గోపీచంద్ కాంబినేషన్‌లో నాలుగో సినిమా పట్టాలు ఎక్కింది. మైత్రీ మూవీ వాళ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత బాలయ్యతో తాను తీసే సినిమాలో రవితేజకి కూడా ఓ పాత్ర క్రియేట్ చేసి ఆ సినిమాను మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడట. గోపీచంద్ రవితేజ కూడా తనకు అత్యంత సన్నిహితుడు. ఇటు బాలయ్యకు మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే బాలయ్య – రవితేజ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో మ‌లినేని గోపీచంద్ ఉన్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news