Moviesవావ్: బాలీవుడ్ ఆఫర్ పట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరో సినిమాతోనే...

వావ్: బాలీవుడ్ ఆఫర్ పట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరో సినిమాతోనే గ్రాండ్ ఎంట్రీ..లక్ అంటే ఇదేగా..!?

శ్రీ లీల .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గర నుంచి కుర్ర హీరో వరకు అందరూ ఆమె పేరు జపిస్తున్నారు. మరీ ముఖ్యంగా భగవంత్ కేసరి సినిమాల్లో సెంటిమెంటల్ పాత్రల్లో ఆమెను చూసిన తర్వాత ఫ్యామిలీ లేడీస్ కూడా ఆమెకు ఫిదా అయిపోయారు.

ఈ క్రమంలోని శ్రీ లీలను టాప్ హీరోయిన్ శ్రీదేవితో కంపేర్ చేస్తూ ఇండస్ట్రీకి దొరికిన మరో శ్రీదేవి అంటూ పొగిడేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే అమ్మడు సినిమా చూసిన ఓ బాలీవుడ్ స్టార్ హీరో ఏకంగా ఇంటికి వెళ్లి ఆఫర్ ఇచ్చారట . అది కూడా బిగ్ బడా ప్రాజెక్టులో కావడం గమనార్హం. ఈ హీరో పక్కన ఏ హీరోయిన్ ఛాన్స్ వస్తే వదులుకోదు .

అయితే శ్రీ లీల మాత్రం ఇప్పుడు అప్పుడే బాలీవుడ్లో కి వెళ్లే ఆలోచన లేదట . ఇంకా టాలీవుడ్ లో చాలా చాలా మంచి రోల్స్ చేయాలనుకుంటుందట . కొంత టైం తర్వాత శ్రీలీల బాలీవుడ్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటుంది శ్రీలీల అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news