Newsఈ ఐరెన్ లెగ్ హీరోయిన్‌కు నాని స‌పోర్ట్ ఎందుకు... చాలా క‌థ...

ఈ ఐరెన్ లెగ్ హీరోయిన్‌కు నాని స‌పోర్ట్ ఎందుకు… చాలా క‌థ న‌డుపుతున్నాడే…!

అన్ని ఇండస్ట్రీలకంటే సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. దర్శకుడికైనా, హీరోకైనా, హీరోయిన్ కైనా మొదటి సినిమా అగ్ని పరీక్ష లాంటిది. అది సక్సెస్ అయితే మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. లేదంటే రెండవసారి అవకాశం కోసం నానా చంకలు నాకాల్సి వస్తుంది. ఈ విషయంలో హీరోయిన్స్ కి కాస్త ఊరట ఉంటుంది. అందంతోనో..కమ్యూనికేషన్ తోనో పర్సనల్ రిలేషన్ తోనో కొంతకాలం నెట్టుకొస్తారు.

కమల్ హాసన్ కూతురు శృతి హాసన్, పొడుగు కాళ్ళ సుందరు పూజా హెగ్డే లాంటి వారికి మాత్రం బ్యాక్ సపోర్ట్ ఎవరో ఒకరు ఉండి స్టార్ హీరోయిన్ అయ్యే వరకూ భుజాల మీద మోస్తారు. వాస్తవానికి పూజా హెగ్డే కి ఇండస్ట్రీలో ఎవరూ లేరు. కానీ, అమ్మడు పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సాధించడానికి దిల్ రాజు, హరీష్ శంకర్, త్రివిక్రం శ్రీనివాస్ లాంటి వారు అండగా నిలిచారు. ఈ ముగ్గురు గనక లేకపోతే పూజా ఎక్కడుండేదో తెలియదు.

ఇక శృతి హాసన్ ఎన్ని సినిమాలు చేసినా ఫ్లాప్సే మూటగట్టుకుంది. దాంతో హీరోయిన్ గా ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. కానీ, పవన్ కళ్యాణ్ ఇవేవీ పట్టించుకోలేదు. బండ్ల గణేష్ నిర్మాత అయి చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ శృతిని గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నారు. ఆ తర్వాత శృతి ఏ రేంజ్ సక్సెస్ చూసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రియాంక అరుళ్ మోహన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ బ్యూటీ తెలుగులో నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీ ద్వారా అడుగుపెట్టింది. రెండు సినిమాలు చేస్తే ఆ రెండూ ఫ్లాపే.

ఆ తర్వాత తెలుగులో అడ్రస్ లేదు. తమిళంలో సూర్య, శివ కార్తికేయన్ ల సరసన నటించినా లాభం లేదు. అయినా పవన్ కళ్యాణ్ తన ఓజి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు నాని మళ్ళీ తన పక్కన హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. కానీ, నానిని అందరూ కామెంట్స్ చేస్తున్నారట. ఐరెన్ లెగ్ అని చెప్పుకుంటున్న ప్రియాంక అరుళ్ మోహన్ కి ఛాన్స్ ఇవ్వడం ఎంటీ అని చెప్పుకుంటున్నారట. నాని ఇలా హీరోయిన్స్ కి బాగా సపోర్ట్ చేస్తాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news