Newsచిరంజీవి సినిమాకు హీరోయిన్ క‌ష్టాలు... ఆ ఆంటీతో భేరాలు మొద‌లు పెట్టారా..?

చిరంజీవి సినిమాకు హీరోయిన్ క‌ష్టాలు… ఆ ఆంటీతో భేరాలు మొద‌లు పెట్టారా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక పనులలో బిజీగా ఉన్నారు చిత్ర బృందం.

ఇదిలా ఉండగా మరో వైపు చిరంజీవి సీనియర్ హీరో కావడంతో చిరు పక్కన నటించే హీరోయిన్ల విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. చిరు రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చిరు పక్కన హీరోయిన్లను సెట్ చేయడం జరిగింది. ఆచార్యలో హీరోయిన్ లేదు. దీంతో ఒకసారి కాజల్, రెండుసార్లు తమన్నా, రెండుసార్లు నయనతారను రిపీట్ చేశారు. వాల్తేరు వీరయ్య కు శృతిహాసన్ ను ఒప్పించారు.

ఇప్పుడు వశిష్ఠ సినిమా విషయంలోనూ హీరోయిన్ ఎంపిక చేయటం దర్శకుడికి పెద్ద టాస్క్ గా మారిందట. ఎట్టకేలకు వశిష్ట కిందా మీదా పడి సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ ను ఒప్పించినట్టు తెలుస్తోంది. ఆమె గతంలో చిరంజీవికి జోడిగా ఠాగూర్ సినిమాలో నటించింది. దీంతో వీరిద్దరిది హిట్ కాంబినేషన్ అన్న పేరు ఉంది. ప్రస్తుతం శ్రియాకు పెళ్ళవడంతోపాటు ఓ బిడ్డకు తల్లి కూడా అయింది.

అయితే ఇటీవల కాలంలో శ్రియ నటించిన పలు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పటికే ఆమె వయసు కూడా 40 దాటేసింది. శ్రియ ఆంటీ అయిపోయింది. మరి చిరంజీవి పక్కన ఆంటీ ని హీరోయిన్ గా సెట్ చేస్తే ఈ జోడి ప్రేక్షకులను ఎంతవరకు కనెక్ట్ చేస్తుంది.. దర్శకుడు వశిష్ట్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news