Newsఎంత‌మంది హీరోలు వెంట‌ప‌డుతున్నా... ఆ ఇద్ద‌రు హీరోల‌పై పెద్ద భారం పెట్టిన...

ఎంత‌మంది హీరోలు వెంట‌ప‌డుతున్నా… ఆ ఇద్ద‌రు హీరోల‌పై పెద్ద భారం పెట్టిన శ్రీలీల‌…!

సినిమా హీరోయిన్ల కెరీర్ కేవలం సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. హీరోలకు వరసగా ఆరేడు ప్లాప్ సినిమాలు వచ్చినా ఇబ్బంది ఉండదు. వాళ్ళకున్న క్రేజ్, అభిమానం ఇవన్నీ వాళ్లకు అవకాశాలు తెచ్చిపెడుతూనే ఉంటాయి. పైగా ఎప్పుడు హీరోయిన్ల విషయంలో గట్టి పోటీ ఉంటుంది. ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఏడెనిమిది సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటే గొప్ప అన్నట్టుగా ఉంది.

నిజానికి తెలుగు సినిమాలలో హీరోయిన్ పార్ట్ నామమాత్రంగా ఉన్నా కూడా ఆ సినిమా సక్సెస్ తోనే హీరోయిన్ కెరీర్ డిసైడ్ చేస్తారు ప్రేక్షకులు అటు సినీ జనాలు. ఇప్పుడు శ్రీ లీల విషయంలో కూడా ఇదే కౌంట్ డౌన్ షురూ కానుంది. ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఈ ముద్దుగుమ్మ చుట్టూ పరుగులు పెడుతుంది. శ్రీలీల‌ ముందుకు వెళ్తుంటే ఆమె వెనక సినీ ప్రేక్షకులు, హీరోలు, స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు అందరూ వెంటపడుతున్నారు.

వరుస పెట్టి సినిమాలకు ఆమె ఓకే చెబుతోంది. ఇటు అడ్వాన్సులు తీసుకోవటం, అటు కాల్ సీట్లు ఇవ్వడం చకచకా జరుగుతుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆమెకు హిట్లు తప్పనిసరి.. పెళ్లి సందడి, ధమాకా రెండు సూపర్ హిట్.. స్కంద మాత్రం అంచనాలు అందుకోలేదు. అందులోనూ శ్రీలీల పాత్ర పరమ రొటీన్ గా ఉంది.

ఇప్పుడు శ్రీలీల నుంచి నాలుగు నెలలలో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నెలలో బాలయ్య భగవంత్ కేసరి వస్తోంది. ఆ తర్వాత నెల రోజులకు వైష్ణవ్ ఆది కేశవ ఉంది. డిసెంబర్లో నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ రాబోతుంది . సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఉంది. ఇవి కాక మరో ఆరేడు సినిమాలు లైన్లో ఉన్నాయి.

ఎన్ని సినిమాలు ఉన్నా కూడా శ్రీలీల‌ బాలయ్యతో భగవంత్ కేసరి , మహేష్ బాబుతో చేస్తున్న గుంటూరు కారం సినిమాలపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే తిరిగి శ్రీ లీల కెరీర్ మరో రెండేళ్లు సాఫీగా సాగిపోతుంది. అందుకే తన వెంట ఎంత మంది స్టార్ హీరోలు పడుతున్నా ఈ ఇద్దరు హీరోలపై ఆమె పెద్ద భారం వేసి ఆశ‌లు పెట్టుకుంద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news