Newsఅత‌డి వ‌ల్ల మోస‌పోయి టార్చ‌ర్ అనుభ‌వించా... రీతూ చౌద‌రి సంచ‌ల‌నం (...

అత‌డి వ‌ల్ల మోస‌పోయి టార్చ‌ర్ అనుభ‌వించా… రీతూ చౌద‌రి సంచ‌ల‌నం ( వీడియో)

బుల్లితెర నటి రీతి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా రీల్స్, హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఎప్పుడు ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటుంది. తాజాగా రీతూ చౌదరి తన యూట్యూబ్ ఛానల్ లో ఆసక్తికర వీడియో షేర్ చేసింది. తనను ఒక వ్యక్తి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆరు నెలల క్రితం త‌ను ఓ ఇంటిని కొన్నాను అప్పుడు ఇంటీరియర్ వర్క్ చేయమని ఒకరికి వర్క్ ఆర్డర్ ఇస్తే అత‌డు ఎలా ? మోసం చేశాడో ఈ వీడియోలో చెప్పుకొచ్చింది.

అతను నా దగ్గర నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడని.. ఇంతలో మా నాన్న చనిపోయారు.. ఇంటి వర్క్‌ పూర్తవలేదు అని తెలిపింది. దీంతో అతడిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. అలాగే అనరాని మాటలు కూడా అన్నాడు.. అతడు వల్ల నేను చాలా మోసపోయాను.. ఓ పక్కన నాన్న మరణించి బాధలో ఉంటే.. మరోపక్క ఇష్టపడి కొనుక్కున్న ఇల్లు వర్క్ పూర్త‌వ‌లేదు.. డబ్బులు కూడా పోయాయని ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది.

ప‌ని రాక‌పోతే రాద‌ని చెప్పుకుండా.. ఫోన్లు ఎత్త‌కుండా నాకు ఎంతో టార్చ‌ర్ చూపించాడ‌ని చెప్పింది. దీనిపై తన పోలీసులు ఆశ్రయించటంతో పోలీసులు ఒత్తిడి చేయడంతో కొంచెం డబ్బు తిరిగి ఇచ్చాడు. మొత్తం రు. 5 ల‌క్ష‌ల‌కు కేవ‌లం రు. 3 ల‌క్ష‌లు మాత్ర‌మే ఇచ్చిన‌ట్టు చెప్పింది. వీటన్నిటితో నేను మానసికంగా చాలా బాధపడ్డాను అని రీతూ చౌదరి వాపోయింది.

ఇప్పుడు ఇంటీరియర్ వర్క్ వేరే వాళ్లకు అప్పగించాను.. నేను పడ్డ బాధ ఎవరూ పడకూడదని ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను.. అలాగే అతడికి పని ఇవ్వకండి అతనిని నమ్మకండి.. ఇంట్లో వాళ్లతో జాగ్రత్తగా ఉండండి అంటూ తనని మోసం చేసిన వ్యక్తి ఫోటో ఆ వ్యక్తి.. ఇంటీరియర్ కంపెనీ వివరాలు కూడా వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రీతూ చౌదరి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news