Newsఆ అమ్మ‌యితోనే ప్ర‌భాస్ పెళ్లి... డేట్ ఎప్పుడంటే... టాప్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన...

ఆ అమ్మ‌యితోనే ప్ర‌భాస్ పెళ్లి… డేట్ ఎప్పుడంటే… టాప్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన ప్ర‌భాస్ పెద్ద‌మ్మ శ్యామ‌ల

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరిని అంటే అందరూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు చెప్తారు. గత ఆరేడేళ్ల నుంచి ప్ర‌భాస్ పెళ్లెప్పుడు అంటే అదిగో ఇదిగో అంటున్నారు తప్పితే ప్రభాస్ పెళ్లి మాత్రం జరగటం లేదు. ప్రభాస్‌కు ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతోమంది హీరోయిన్లతో ఎన్నోసార్లు ప్రేమాయణం ఉన్నట్టు.. పెళ్లి జరిగినట్టు వార్తలు రాసేశారు. ఇక ప్రభాస్ – అనుష్క పెళ్లి గురించి కొన్ని వేలసార్లు వార్తలు వచ్చాయి.

తాజాగా కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ పెళ్లి, తేది ఎప్పుడు అనేది ? కూడా రివీల్ చేశారు. ప్రభాస్ పెళ్లి అనగానే చాలామందికి అనుష్కనే గుర్తుకు వస్తుంది. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు కావచ్చు.. కానీ ఇద్దరు కలిసి సినిమాలు చేయటం.. ఇప్పటికీ వేరువేరు కారణాలతో పెళ్లి చేసుకోకుండా ఉండడంతో ఎప్పటికైనా ఈ జోడి పెళ్లి చేసుకుంటుందేమోనని అభిమానులు ఆశతో ఉన్నారు.

మరోవైపు కృష్ణంరాజు బతికున్నప్పుడే ప్రభాస్ పెళ్లి చేద్దామనుకున్నారు.. కానీ ప్రభాస్ బిజీ షెడ్యూల్ వ‌ల్ల‌ అది జరగలేదు. తాజాగా దేవి నవరాత్రుల‌ సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి విలేకరులతో మాట్లాడారు. విలేకరులు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ? అని ప్రశ్నించగా దీనికి బదులిచ్చిన ఆమె కృష్ణంరాజు తమతో లేకపోయినా ఆయన పేరు నిలబెడుతూ మా ఫ్యామిలీ ముందుకెళ్తోందన్నారు.

ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటుంది అమ్మాయి ఎవరు ? డేట్ ఎప్పుడు అనేది చెప్పను గాని త్వరలోనే ఈ శుభకార్యం ఉంటుంది.. వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడని శ్యామలాదేవి చెప్పేశారు. మరి శ్యామలాదేవి చెప్పినట్టు వచ్చే దసరాలోపు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా ? ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్య‌చిల‌ర్ త‌న బ్యాచిల‌ర్ లైఫ్‌న‌కు శుభం కార్డు పలుకుతాడా ? అన్నది చూడాలి. ఇక ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా సలార్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news