Newsఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో అలాంటి పాత్ర‌లో రోజా... ఆ...

ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో అలాంటి పాత్ర‌లో రోజా… ఆ హీరో ఆమె కోరిక తీరుస్తాడా…?

బుల్లితెర నటి శ్రీవాణి ఎన్నో సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో ఆమె నటించిన సీరియల్స్‌ చాలా పాపులర్ అయ్యాయి. కొంతకాలంగా సీరియల్స్ కు బ్రేక్ ఇచ్చిన ఆమె అభిమానుల కోసం యూట్యూబ్ ఛానల్ తో టచ్ లో ఉంటుంది. ఇప్పుడు నటన నుంచి విరామం తీసుకుని తన భర్త, నటుడు విక్రమాదిత్యతో కలిసి కొత్త అడుగులు వేస్తోంది. మీ కడుపునిండా తెలుగు వారి రుచులు అనే హోటల్‌ను ప్రారంభించింది.

హైదరాబాద్ మణికొండలో ఇటీవల ఏర్పాటు చేసిన ఈ హోటల్‌ ఏపీ మంత్రి, ప్రముఖ సినీనటి ఆర్కే రోజా ప్రారంభించారు. అనంతరం ఈ వ్యాపార రంగంలో శ్రీవాణి రాణించాలని రోజా శుభాకాంక్షలు తెలిపారు. ఇక రోజా సినిమాల విషయానికొస్తే సుమారు 10 ఏళ్లకు పైగా రోజా సినిమాలుకు దూరంగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో ఆమె కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె సినిమాలతో పాటు రియాల్టీ షోలకు కూడా దూరం దూరంగా ఉంటున్నారు.

మళ్ళీ టాలీవుడ్ లో మీ రీఎంట్రీ ఎప్పుడు ఉంటుంది ? ఏ హీరోతో కలిసి సినిమా చేస్తారు అన్న ప్రశ్నకు ? ఆమె తన మనసులో మాట బయటపెట్టారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని రోజా తెలిపారు. అయితే మహేష్ కు తల్లిపాత్ర మాత్రం చేయనని వదిన లేదా అక్క పాత్రలలో ఏదైనా పర్వాలేదు సంతోషంగా చేస్తానని రోజా తెలిపారు.

కాంతారా సినిమా చాలా బాగుందని చెబుతూనే.. బేబీ సినిమా ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉందని రోజా చెప్పారు. మరి రోజా కోరిక మహేష్ బాబు తీరుస్తారా ? తన సినిమాలో ఆమెకు అక్క లేదా వదిన పాత్ర ఆఫర్ చేస్తారా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news