Newsసినిమాల్లోకి ప‌వ‌న్ కొడుకు అకీరా... హీరోగా కాదు... అదిరిపోయే ట్విస్ట్ ఇది...!

సినిమాల్లోకి ప‌వ‌న్ కొడుకు అకీరా… హీరోగా కాదు… అదిరిపోయే ట్విస్ట్ ఇది…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాజీ హీరోయిన్ రేణు దేశాయ్‌ ముద్దుల తనయుడు అకిరా నందన్. మనోడి రూటే సపరేటు అన్నట్టుగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడుగా అఖీరా కూడా నటనే వృత్తిగా ఎంచుకుంటాడు అని అంతా అనుకుంటున్నారు. టాలీవుడ్లో అది కామన్ కూడా..! అందులోను బలమైన మెగా ఫ్యామిలీ వారసత్వం హీరోలు, నిర్మాతలు, దర్శకుడు ఇలా ఎవరితో ఏమాత్రం బీరకాయ పీచు చుట్టరికం ఉన్నా హీరో అయిపోవాలని అందరూ చూస్తూ ఉంటారు.

ఇక అకీరా నంద‌న్‌లో హీరో అయ్యే ఫేస్ కట్స్ బాగా ఉన్నాయి. ఇదే ప్రశ్న అఖీరా తల్లి రేణు దేశాయ్ కు ఎదురైంది. ఆమె లేటెస్ట్ గా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్లలో మీడియాతో మాట్లాడినప్పుడు మీ తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడా ? అని ప్రశ్నించారు. అకిరా నటనను కెరీర్ గా ఎంచుకోవాలని అనుకోవడం లేదు.. తాము కూడా ఆ దిశ‌గా వెళ్ళమని బలవంతం కూడా చేయటం లేదని రేణు వెల్లడించారు.

ప్రస్తుతం అఖీరా ఫిల్మ్‌ ప్రొడక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, మ్యూజిక్ కోర్సులు నేర్చుకుంటున్నాడని వాటి మీద ఆసక్తిగా ఉన్నాడని రేణు తెలిపారు. అకీరా హీరోగా వస్తాడని ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించవచ్చు. అయితే అలా పూర్తిగా నిరాశ పడాల్సిన పని కూడా లేదు.

టాలీవుడ్ లో చిన్న, పెద్ద సెలబ్రిటీల పిల్లలు కచ్చితంగా ఏదో ఒక టైంలో నటన వైపే వస్తారు. అకిరా ముందు ఎంత స్క్రిప్ట్ రైటింగ్.. మ్యూజిక్ కోర్సులు నేర్చుకున్న తర్వాత బలమైన మెగా ఫ్యామిలీ లెగసీ కావడంతో హీరోగా ఎంట్రీ ఇస్తాడ‌నే ఆశిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news