Newsబాల‌య్య‌ను మ్యాచ్ చేయ‌లేని చిరంజీవి... బ్యాలెన్స్ ఎక్క‌డ త‌ప్పుతున్నాడు...!

బాల‌య్య‌ను మ్యాచ్ చేయ‌లేని చిరంజీవి… బ్యాలెన్స్ ఎక్క‌డ త‌ప్పుతున్నాడు…!

సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే పోటీ ఉండేది. గత మూడు దశాబ్దాల నుంచి ఈ పోరు కొనసాగుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే అంతకు ముందు నుంచి కూడా ఇదే పరిస్థితి ఉండేది. ఈ ఇద్దరు హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి అంటే ఇద్దరు హీరోల అభిమానుల మధ్య బయట పెద్ద యుద్ధం అన్నట్టుగా అప్పట్లో వాతావరణం నడిచేది.

1990 తర్వాత ఈ విషయంలో బాలయ్య పై చిరంజీవిది పై చేయి అయ్యింది. ఆ తర్వాత సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా సినిమాలతో బాలయ్య ఆధిపత్యం చూపించారు. ఆ తర్వాత చిరంజీవి పదేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చేశారు. అనంతరం ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీయంట్రీ ఇచ్చారు. ఇది చిరంజీవి కెరీర్ లో 150వ సినిమా ఆ సినిమాకు పోటీగా బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి కూడా 2017 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. రెండు సినిమాలు సూపర్ హిట్ అయినా వసూళ్లపరంగా చిరంజీవిది పై చేయి అయింది.

ఈ ఏడాది సంక్రాంతికి చిరు వాల్తేరు వీరయ్య బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలు రెండు పోటీపడి రెండు సూపర్ హిట్ అయ్యాయి. అయితే వసూళ్ల పరంగా మళ్ళీ చిరంజీవిదే పై చేయి. అయితే రీయంట్రీ ఇచ్చాక ఇటు చిరంజీవి అటు బాలయ్య నటిస్తున్న సినిమాలపరంగా పోల్చి చూస్తే చిరంజీవి అస్సలు బాలయ్య సినిమాలను మ్యాచ్ చేయలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు చిరంజీవి నవరసాలను పండించేవారు. కళ్ళతోనే యాక్టింగ్ చేయగల అద్భుతమైన టాలెంట్ ఆయన సొంతం.

కానీ రీఎంట్రీ తర్వాత ఆయన కథా బలం లేని సినిమాలలో నటిస్తున్నారు. బాల‌య్య సినిమాలు, ఆయ‌న న‌ట‌న ముందు తేలిపోతున్నారు. పైగా అన్ని రీమేకులు.. అందుకే అన్ని పెద్ద డిజాస్టర్ అవుతున్నాయి.. ఇటు బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి , భగవత్ కేసరి లాంటి వైవిధ్యమైన కథలు ఎంచుకుని సూపర్ హిట్ లు కొడుతూ దూసుకుపోతున్నారు. ఏది ఏమైనా రీ ఎంట్రీ తర్వాత బాలయ్య జోరు ముందు చిరంజీవి బేజారు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news