Movies"ఒక్కసారి అనసూయను ఎత్తుకోవాలని ఉంది" ..అనంత్ శ్రీరామ్ కూడా సిగ్గు వదిలేశాడా..?...

“ఒక్కసారి అనసూయను ఎత్తుకోవాలని ఉంది” ..అనంత్ శ్రీరామ్ కూడా సిగ్గు వదిలేశాడా..? ఏంట్రా బాబు ఇది(వీడియో)..!

అనసూయ ఎక్కడ ఉంటే అక్కడ కుర్రాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది అంటూ కొందరు జనాలు చెప్పుకొస్తూ ఉంటారు. బహుశా అది నిజమనే చెప్పాలి లేకపోతే నిన్న మొన్నటి వరకు చాలా సైలెంట్ గా తన పని తాను చూసుకోపోయినా అనంత శ్రీరామ్ అనసూయ ను చూడగానే హద్దులు మీరు పోయే విధంగా పంచ్ కామెంట్స్ చేయడం ఏంటి..?

ఇలా పంచెస్ వేస్తాడు అని ఎవరైనా ఊహించారా ..? అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అనంత శ్రీరామ్ అనసూయ పై కామెంట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అనసూయ జబర్దస్త్ షో మానేశాక బుల్లితెరపై కనిపించడమే మానేసింది . రీసెంట్గా జీ కుటుంబం అవార్డ్స్ 2023 లో సందడి చేసింది . వెండితెర బుల్లితెర సెలబ్రిటీలతో అనసూయ చాలా బాగా ఎంటర్టైన్ చేసింది.

అయితే జీ తెలుగు అవార్డ్స్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఒక్కొక్కరి పర్ఫామెన్స్ ప్లే చేస్తూ ఉంటారు . ముఖ్యంగా అనసూయ పర్ఫామెన్స్ అద్దిరిపోయింది. ఈ క్రమంలోనే సౌందర్య అంతపురం సినిమాలోని అసలేం గుర్తుకురాదు పాటకు తనదైన స్టైల్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చి కట్టిపడేసింది అనసూయ . ఆ తర్వాత గేయ రచయిత అనంత శ్రీరామ్ తో భగవంత్ కేసరిలోని ఉయ్యాలో ఉయ్యాలో సాంగ్ కి డాన్స్ చేశారు .

అయితే ఆ సాంగ్ లో బాలకృష్ణ ఓ పాపని ఎత్తుకుంటాడు . దీని గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అనంత శ్రీరామ్..” నాకు కూడా నిన్ను చేతులతో ఎత్తుకొని డాన్స్ చేయాలని ఉంది . కానీ అది నా వల్ల కాదు నాకు చాలా కష్టం ఏమనుకోకే ” అంటూ కౌంటర్ వేస్తాడు. ఇదంతా చాలా హెల్దీగానే జరిగింది . కానీ కావాలనే కొందరు ఆకతాయిలు అనసూయని ట్రోల్ చేసే విధంగా ఈ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు . దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news