Newsశ్రీ లీల లిప్ కిస్ లొల్లి... సోషల్ మీడియాని షేక్ చేస్తున్న...

శ్రీ లీల లిప్ కిస్ లొల్లి… సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో..

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ త‌ర్వాత మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కు జోడిగా చేసిన ధమాకా బ్లాక్ బస్టర్. ఆ సినిమాతో శ్రీలీకూ ఫుల్ పాపులారిటీ రావడంతో పాటు ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో దాదాపు పదికి పైగా సినిమాలు ఉన్నాయి. నెల రోజుల వ్య‌వ‌ధిలో రామ్ స్కంద‌, బాలకృష్ణ భగవంత్‌ కేసరి సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

స్కంద అంచనాలు అందుకోలేదు.. భగవంత్‌ కేసరి సూపర్ డూపర్ హిట్. ఇక ఆమె చేతిలో ప‌వ‌న్‌, మ‌హేష్‌, నితిన్ లాంటి క్రేజీ హీరోల‌ సినిమాలు కూడా ఉన్నాయి. యాక్టింగ్, గ్లామర్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ శ్రీలీల‌ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం శ్రీలీల‌ ఎలా.. ఏం మాట్లాడినా ? ఏ లుక్ లో కనిపించిన టాక్ ఆఫ‌ ద టౌన్ అయిపోతుంది. సోషల్ మీడియాలో ఆమె గురించి కుప్పలు తెప్పులుగా వార్తలు వస్తున్నాయి. శ్రీలీల తన తాజా ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లిప్‌కిస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

నేను ఇప్పటివరకు ఏ హీరోతోను లిప్ లాక్ సీన్లు నటించలేదు.. అలా చేయాల్సి వస్తే నా మొదటి ముద్దు నా భ‌ర్త‌కే ఇస్తాను అని చెప్పింది. అయితే ఆమె గతంలో ఓ సినిమాలో హీరోకు ఘాటుగా ముద్దుపెట్టిన విషయం మరిచిపోయి అబద్ధం చెప్పి అడ్డంగా దొరికిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీలీల‌ 2019లో కన్నడ కిస్ సినిమాలో యంగ్ హీరో విరాట్ కు ఒక సినిమాలో లిప్ లాక్ ఇస్తుంది.

దీన్నే తెలుగులో ఐ లవ్ యు ఇడియట్ పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా అంతగా తెలుగులో ఆడలేదు. ఈ సినిమాలో ఓ సీన్లో హీరోయిన్.. హీరోతో తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత హీరోకు లిప్ లాక్ సీన్ కూడా ఇస్తుంది. ఇక శ్రీలీల‌ మొదటి ముద్దు గోల ఇప్పుడు నెట్టెంట చర్చ‌నీయాంశంగా మారింది. ప్రస్తుతం శ్రీలీల‌ లిప్ లాక్ వీడియోస్ ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news