News' భ‌గ‌వంత్ కేస‌రి ' కి యాంటీగా లియోకు మెగా ఫ్యాన్స్...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ కి యాంటీగా లియోకు మెగా ఫ్యాన్స్ స‌పోర్ట్.. బ‌న్నీ ఫ్యాన్స్ బాల‌య్య వైపే..?

నందమూరి బాలకృష్ణ – మెగాస్టార్ చిరంజీవి సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఇద్దరు హీరోల అభిమానుల ఫైట్ మామూలుగా ఉండదు. అందులోనూ ఒకేసారి ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే అభిమానులు బాక్సాఫీస్ యుద్ధం మామూలుగా ఉండదు. 2017లో చిరంజీవి సంక్రాంతికి ఖైదీ నెంబర్ 150 – బాల‌య్య గౌతమీపుత్ర శాతకర్ణి రెండు సినిమాలు ఒకేసారి వచ్చినప్పుడు ఇద్దరు హీరోల అభిమానుల సోషల్ మీడియా యుద్ధం ఒక రేంజ్ లో జరిగింది. అప్పుడు రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

మళ్లీ ఈ ఏడాది సంక్రాంతికి చిరు వాల్తేరు వీరయ్య – బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఆ టైంలో థియేటర్ల కోసం జరిగిన గొడవలు.. అభిమానుల మాటల తూటాలతో సోషల్ మీడియా హోరెత్తింది. మళ్లీ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య సినిమా ప్లాప్ అయితే చిరు అభిమానులు ట్రోలింగ్ చేస్తారు. అలాగే చిరు సినిమా ప్లాప్ అయినా బాలయ్య అభిమానులు కూడా వదలరు. తాజాగా వచ్చిన చిరంజీవి భోళా శంకర్‌ మీద ఎంత ట్రోలింగ్ నడవాలో అంత ట్రోలింగ్ నడిచింది.

ఇప్పుడు బాలయ్య భగవంత్ కేసరి సినిమా వస్తోంది. అటు చిరంజీవి సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ టైంలో బాలయ్య సినిమాకు పోటీగా విజయ్ లోకేష్ కనగ‌రాజ్‌ డబ్బింగ్ సినిమా లియో వస్తోంది. రెండూ ఒకే టైంలో వస్తుండడం.. అటు బాలయ్య సినిమా ఉండడంతో మెగా అభిమానులు విజయ్ లియో సినిమాకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఆ సినిమాకు మంచి ఓపెనింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే లియో సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో బుకింగ్స్ లో మంచి ఫిగర్స్ కనబడటం వెనక మెగా అభిమానుల మద్దతు ఉందని తెలుస్తోంది. అదే టైంలో మళ్లీ బన్నీ అభిమానుల సపోర్ట్ బాలయ్యకు కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news