Moviesఅలా ఆ పేరుతో పిలిస్తే ప్రభాస్ కి చెడ్డ చిరాకు.. గుండు...

అలా ఆ పేరుతో పిలిస్తే ప్రభాస్ కి చెడ్డ చిరాకు.. గుండు పగలకొట్టేస్తాడు..!!

ప్రభాస్ ఆరడుగుల అందగాడు.. ఆజానుబాహుడు .. టెంప్టింగ్ ఫిగర్.. ఆ కటౌట్ ను చూస్తే ఎలాంటివారైనా సరే టెంప్ట్ అయిపోవాల్సిందే . ఇలాంటి డైలాగ్స్ కొడుతూ ఉంటారు ప్రభాస్ అభిమానులు . పాన్ ఇండియా హీరో గా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ ప్రాజెక్టుకె..సల్లార్ సినిమాలలో బిజీబిజీగా ముందుకు వెళ్తున్నాడు. అంతేకాదు రీసెంట్ గానే కాళ్లకు సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్న ప్రభాస్ .. త్వరలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ ను పెట్ నేమ్ తో పిలిస్తే అస్సలు నచ్చదు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . ప్రభాస్ ను చాలా మంది తన ఫ్రెండ్స్ ఉప్పు ఉప్పు అని పిలిచేవారట . ఉప్పలపాటి ప్రభాస్ ను చాలా మంది ఉప్పు అంటూ ముద్దుగా పిలిచేవారట . అయితే మరి కొంతమంది పప్పు అంటూ కూడా నాటీగా పిలుస్తారట . ఈ రెండు పేర్లలో ఏ పేరు పెట్టి పిలిచిన ప్రభాస్ కి మహా చెడ్డ చిరాకట .

ఆయనకు పెట్ నేమ్ తో కాకుండా ఒరిజినల్ నేమ్ తో పిలిస్తేనే చాలా చాలా ఇష్టమట . అంతేకాదు అనుష్క సైతం చాలాసార్లు ఆ పేరుతో పిలిపి పిలిచి సరదాగా ప్రభాస్ ని ఆటపట్టించిందట . అయితే గోపీచంద్ మాత్రం ఇప్పటికి తన ఫ్రెండ్ ప్రభాస్ పూర్తి పేరు పెట్టి పిలుస్తూ ఆయన ఇష్టా ఇష్టాలకు గౌరవిస్తున్నాడు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news