Newsఆ ఇద్ద‌రి ఉచ్చులో ప‌డి విల‌విల్లాడుతోన్న దిల్ రాజు... భారీగా బొక్క...

ఆ ఇద్ద‌రి ఉచ్చులో ప‌డి విల‌విల్లాడుతోన్న దిల్ రాజు… భారీగా బొక్క ప‌డిందిగా…!

మెగా పవర్ స్టార్ నుంచి త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ బిరుదుకి మారిపోయాడు రామ్ చరణ్. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ మళ్ళీ పాన్ ఇండియా సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని ఎంతో ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు. ఈ క్రమంలోనే కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ శంకర్తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు రు. 300 కోట్ల భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికీ రెండు సంవత్సరాల క్రితం షూటింగ్ ప్రారంభమైంది.

అప్పటినుంచి పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ షూటింగ్ సాగుతూ వస్తోంది. ఈ యేడాదిలోనే సినిమా రిలీజ్ అవుతుందని అన్నారు. దసరా, దీపావళికి అన్నారు.. కానీ రిలీజ్ అయ్యేలా లేదు. వచ్చే సంక్రాంతికి కూడా గేమ్ చేంజర్ రిలీజ్ కావటం లేదు. ఈ లెక్కన వచ్చే సమ్మర్ లో కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ధియేటర్లోకి రావాలంటే ఏడాదికి పైగానే టైం పట్టేలా ఉందని తెలుస్తోంది. ఏ ముహూర్తానా ఈ సినిమా ప్రారంభించారో కానీ ఏదో ఒక అవాంతరం ఎదురవుతూ వస్తోంది.

శంకర్‌కు, దిల్ రాజ్‌కు బడ్జెట్ విషయంలో చిన్నపాటి గ్యాప్ వచ్చిందన్న ప్రచారం జరిగింది. దీనికి తోడు రామ్ చరణ్ రెండుసార్లు గాయపడ్డారు. ఒకసారి కీయారా అద్వానీ డేట్లు దొరకలేదు. ఇక శంకర్ – కమలహాసన్ తో ఇండియన్ 2 సినిమాతో పాటు గేమ్‌చేంజ‌ర్ రెండు సమానంగా షూటింగ్ చేస్తుండడంతో గేమ్‌చేంజ‌ర్ షూటింగ్ మరింత ఆలస్యం అవుతుంది. అసలే రు. 300 కోట్ల బడ్జెట్.. దీనికి తోడు దిల్ రాజు ఫైనాన్స్ తీసుకోవడంతో ప్రతి నెల వడ్డీలు భారీగా క‌డుతున్నట్టు తెలుస్తోంది.

సినిమా బాగా ఆలస్యం అవుతుండడంతో వడ్డీలు బాగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ టెన్షన్ కూడా దిల్ రాజును ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అసలు గేమ్ చేంజర్ ఎప్పుడు షూటింగ్ పూర్తిచేసుకుని ? ఎప్పుడు థియేటర్లోకి వస్తుందో ? పెద్ద గొందరగోళం అయిపోయింది. మెగా అభిమానులు కూడా ఈ విషయంలో బాగా కలవరపడుతూ ఉన్న మాట వాస్తవం. ఇటు రాంచరణ్ అటు శంకర్‌ మ‌ధ్య‌లో దిల్ రాజు అయితే బాగా నలిగిపోతున్నట్టే కనిపిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాతో నేష‌న‌ల్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకోవాల‌నుకుంటే రిలీజ్‌కు ముందే చాలా క‌ష్టాలు త‌ప్ప‌ట్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news