Movies"చిన్న పిల్లాడిలా చిందులేసిన బాలయ్య"..భగవంత్ కేసరి నుండి ఫస్ట్ పాట వచ్చేసిందోచ్(వీడియో)..!!

“చిన్న పిల్లాడిలా చిందులేసిన బాలయ్య”..భగవంత్ కేసరి నుండి ఫస్ట్ పాట వచ్చేసిందోచ్(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రిలో నరసిం హంగా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . అందానికి అందం.. నటనకి నటన .. మాస్ కి మాస్.. యాక్షన్ కి యాక్షన్ సినిమాలు తీసి అన్ని జోనర్స్ ఉన్న సినిమాలో నటించి అభిమానులకు ది మోస్ట్ ఫేవరెట్ గా మారిపోయారు నందమూరి బాలకృష్ణ . కాగా ఏజ్ కి సంబంధం లేకుండా ఎలాంటి పాత్రలు అయినా సరే అవలీలగా నటించే బాలకృష్ణ రీసెంట్ గా నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది.

కాగా కొద్ది సేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగ్ రిలీజ్ చేశారు మేకర్స్. గణేష్ యాంతం అనే పేరుతో ఈ పాటను కొద్దిసేపటి ముందే రిలీజ్ చేశారు భగవంత్ కేసరి టీం. కాగా చాలా మాస్ బీట్ తో ఫుల్ టు ఫుల్ తెలంగాణ యాసతో ఉన్న ఈ పాట అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . మరి ముఖ్యంగా ఈ వీడియో చూస్తుంటే కచ్చితంగా బాలయ్య – శ్రీలీల డాన్స్ పెర్ఫార్మెన్స్ కి అవార్డు కన్ ఫామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

అంతేకాదు బాలయ్య ను ఇప్పటివరకు ఇలాంటి లుక్స్ లో మనం చూడలేదు. కళ్ళకి అద్దాలు పెట్టుకొని చాలా స్టైలిష్ అండ్ ట్రెండీ ట్రెడిషనల్ కుర్తాలో బాలయ్య అద్దిరిపోయాడు. నుదుట నామం పెట్టుకొని బాలయ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కేక పెట్టిస్తున్నాయి. అంతేకాదు బాలయ్య తో పోటి శ్రీలీల కూడా అదే రేంజ్ లో స్టెప్స్ ఇరగదీసింది. ఫస్ట్ సింగిలే ఈ రేంజ్ లో ఉంటే రాబోయే పాటలు ఏ రేంజ్ లో ఉంటాయో అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . మొత్తానికి తమన్ తన మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడని చెప్పాలి . తమన్ మాస్ బీట్ ..బాలయ్య ఊర నాటు మాస్ స్టెప్స్..శ్రీలీల కేక పట్టించే అందాలు ఈ పాటకు మరింత ప్లస్ కానున్నాయి. ఈ సినిమాకి ఈ పాట హైలెట్ కాబోతుంది అంటూ తెలుస్తుంది. ప్రజెంట్ ఈ పాట యూట్యూబ్లో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది..!!

bha
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news