Movies"అప్పట్లో నాగ్-అమల..ఆ తరువాత చై-సామ్.. ఇప్పుడు వరుణ్-లావ్".. ఫైనల్లీ అదే...

“అప్పట్లో నాగ్-అమల..ఆ తరువాత చై-సామ్.. ఇప్పుడు వరుణ్-లావ్”.. ఫైనల్లీ అదే పని చేసి చూపిస్తున్నారే..!!

జనాలకి డిఫరెంట్ కంటెంట్ పరిచయం చేయడంలో టాలీవుడ్ డైరెక్టర్స్ తర్వాతే మిగతా ఎవ్వరైనా అని చెప్పడంలో అస్సలు సందేహం లేదు . మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎవరైనా ఉంటే చాలు ఆ జంట క్రేజీని వాడుకోవడానికి డైరెక్టర్ ఆ ఇద్దరిని పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది అలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీలో అలా సక్సెస్ అయిన హీరో హీరోయిన్స్ కూడా ఉన్నారు . గతంలో నాగార్జున – అమల ..ఆ తర్వాత సమంత – నాగచైతన్య కూడా ఆలిస్ట్ లోకి వస్తారు .

అయితే తాజాగా వరుణ్ – లావణ్యలు కూడా అదే లిస్టులోకి రాబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ప్రెసెంట్ వరుణ్ తేజ్ కెరియర్ అంత ఆశాజనకంగా లేదు . ముట్టుకున్నదల్లా బ్లాస్టింగ్ రేంజ్ లో డిజాస్టర్ అయిపోతుంది. ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంది. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ .. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు నిర్మాతగా డైరెక్టర్ క్రిష్ వ్యవహరించబోతున్నారు అంటూ కూడా సమాచారం అందుతుంది.

ఈ సినిమాలో హీరోయిన్గా లావణ్య త్రిపాఠిని చూస్ చేసుకున్నారట శేఖర్ కమ్ముల. ఆయన సినిమాలు అంటే ఎంత చక్కగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఓ డిఫరెంట్ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇక ఫీల్ గుడ్ డైరెక్టర్ అన్న బిరుదు కూడా ఉంది . అలాంటి ఓ డైరెక్టర్ కాంబోలో వరుణ్ లావణ్య నటిస్తే ఖచ్చితంగా బిగ్ బ్లాక్ బస్టర్ పక్క అంటున్నారు జనాలు. ఈ సినిమా అటు వరుణ్ తేజ్ కి ఇటు లావణ్య కి మంచి సక్సెస్ ఇవ్వబోతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ధనుష్ తో తెరకెక్కించే కుబేర తర్వాత శేఖర్ కమ్ముల – వరుణ్ -లావణ్య తెరకెక్కించే సినిమాలను సెట్స్ పైకి తీసుకురాబోతున్నట్లు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news