Moviesఅప్పట్లో విజయశాంతి..ఇప్పట్లో కాజల్..ఆ పని చేయాలంటే ఈ ఇద్దరే ది బెస్ట్..మిగతా...

అప్పట్లో విజయశాంతి..ఇప్పట్లో కాజల్..ఆ పని చేయాలంటే ఈ ఇద్దరే ది బెస్ట్..మిగతా వాళ్లు వేస్ట్..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ టైం ఎంత తక్కువగా ఉంటుందో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా పెళ్లి కాకముందే హీరోయిన్స్ ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటారు. పెళ్లి తర్వాత అంత క్రేజ్ సంపాదించుకోలేరు . చాలా తక్కువ మంది మాత్రమే పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి అలాంటి రేర్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోగలరు . ఆ లిస్ట్ లోకే వస్తుంది కాజల్ అగర్వాల్ . ఫస్ట్ ఇన్నింగ్స్ లో తనదైన స్టైల్ లో దున్నిపడేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లోను అదే హవాను కొనసాగించడానికి చాలా చాలా కష్టపడుతుంది .

రీసెంట్గా సత్యభామ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది కాజల్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది . ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బాలకృష్ణ అదే విధంగా అనిల్ రావిపూడి గెస్ట్లుగా హాజరయ్యారు . ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి .. కాజల్ అగర్వాల్ ఓ రేంజ్ లో పొగిడేసాడు. ” ఒకప్పుడు ఇండస్ట్రీకి విజయశాంతి ఎలాగో ఇప్పుడు కాజల్ అలా అని ..ఒకప్పుడు ఇండస్ట్రీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలు అంటే విజయశాంతి గారి గుర్తొచ్చేవారు అని.. లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే ముందుగా అందరూ విజయశాంతి గారి ఇంటికి వెళ్లేవారు అని”..

“ఇప్పుడు అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ సంపాదించుకునేసింది కాజల్ అగర్వాల్ అని ..కాజల్ అగర్వాల్ ఇంకా ఇంకా మంచి హిట్స్ అందుకోవాలని కోరుకుంటున్నాము అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. కాగా భగవంత్ కేసరి సినిమా తర్వాత అనిల్ రావిపూడి కొంచెం టైం తీసుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఆయన వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాను తెరకెక్కించబోతున్నారట . ఈ సినిమా ఎఫ్2 ఎఫ్3కి మించిన రేంజ్ లో ఉండబోతుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news