Moviesరకుల్ ప్రీత్ సింగ్ ని చూసి అలాంటి పని చేయబోతున్న తమన్నా.....

రకుల్ ప్రీత్ సింగ్ ని చూసి అలాంటి పని చేయబోతున్న తమన్నా.. ఫ్యాన్స్ ఊహించిన షాక్ ఇవ్వబోతుందిగా..!

సాధారణంగా ఎవరైనా సరే ఒక పని చేసి సక్సెస్ అయితే .. ఆ పని మనం ఎందుకు చేయకూడదు అని ఆలోచన అందరికీ వస్తూ ఉంటుంది. కామన్ పీపుల్స్ కే కాదు చాలామంది స్టార్ సెలబ్రిటీస్ కి కూడా ఇదే ఆలోచన ఉంటుంది.అయితే ఇప్పుడు అదే ఆలోచనను ఇంప్లిమెంట్ చేయబోతుంది హీరోయిన్ తమన్నా అంటూ ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ తమన్నా త్వరలోనే బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టబోతుందట .

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఎందుకంటే తమన్నాకి బిజినెస్ లో నాలెడ్జ్ అయితే శూన్యం. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ పెళ్లి తర్వాత ఇండస్ట్రీలో ఆఫర్స్ అందుకోలేకపోతున్నారు. ఆ కారణంగానే పలువురు ఫైనాన్షియల్ ఇబ్బందులు రాకుండా వాళ్ళు బిజినెసులల్లో పెట్టబడులు పెడుతూ.. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు . ఇప్పటికే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత బిజినెస్ ఎలా ముందుకు తీసుకెళ్తుందో మన కళ్లారా చూస్తున్నాము.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ బిజినెస్ లో ఫుల్ సక్సెస్ అవ్వడంతో ఆమెను చూసి ఇప్పుడు తమన్నా అదే పని చేయబోతుందట. పలు బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా తానే సొంతంగా బిజినెస్ లు కూడా స్టార్ట్ చేయబోతుందట . ఫుడ్ బిజినెస్ ..జిమ్ బిజినెస్ లతో పాటు.. పలు రంగాలలో అని పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందట . దీని కోసం ఎక్స్ పర్ట్స్ హెల్ప్ కూడా తీసుకుంటుందట. అంతేకాదు త్వరలోనే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ను పెళ్ళి కూడా చేసుకోబోతుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news