Moviesకృష్ణ ఎంత చెప్పిన వినకుండా మహేష్ బాబు చేసిన పని ఇదే.....

కృష్ణ ఎంత చెప్పిన వినకుండా మహేష్ బాబు చేసిన పని ఇదే.. జస్ట్ మిస్.. లేకపోతే ప్రాణాలే పోయిండేటివి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . ఘట్టమనేని హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో నటించి ఫ్యామిలీ లేడీస్ సైతం అట్రాక్ట్ చేసుకున్నాడు . ఆయన వార్సుడిగా మహేశ్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఏ మాత్రం ఏ రోజు తన అవకాశాల కోసం తండ్రి పేరు ఉపయోగించుకోలేదు .

సొంత టాలెంట్ తోనే కష్టపడి పైకి ఎదుగుతూ వచ్చాడు మహేష్ బాబు . కాగా కృష్ణ ఒక సినిమా విషయంలో మహేష్ బాబుకి వార్నింగ్ ఇచ్చినా.. తండ్రి మాటలను పట్టించుకోకుండా కృష్ణ వద్దు వద్దు అంటున్న కూడా మహేష్ బాబు చేసిన మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ మురారి . ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంత కష్టపడ్డాడు అన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది .

ఈ సినిమాలో “భమ భమ బంగారు” సాంగ్ చేస్తున్నప్పుడు మహేష్ బాబుకి 103 ఫీవర్ ఉండిందట. డాక్టర్ అస్సలు బయటకు వెళ్లడం మంచిది కాదు .. ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పారట. కానీ మహేష్ బాబు మాత్రం తన వల్ల వేరే వాళ్లు కాల్ చేసి ఇబ్బందులకు గురవ్వకూడదు అంటూ సినిమా షూట్ కి అటెండ్ అయ్యారట. అంతేకాదు ఓ సీన్లో భాగంగా తడవాల్సిన సమస్య వచ్చిందట . ఫీవర్ మీద చన్నీళ్లతో తడిస్తే అది ఎంత డేంజర్ అన్న విషయం అందరికీ తెలిసిందే ..డాక్టర్స్ అస్సలు ఒప్పుకోలేదట.. కృష్ణ గారు కూడా కృష్ణవంశీకి ఈ సీన్ చేయొద్దు అంటూ సజెస్ట్ చేశారట.

అయితే ఈ పాటలో ఆ సీన్ ఇంపార్టెంట్ అని రిక్వెస్ట్ చేయడంతో మహేష్ బాబు – కృష్ణవంశీ కోసం ఫీవర్ ఉన్నా సరే చన్నీళ్లతో తడిసి ఆ షాట్ ను కంప్లీట్ చేశారట. అయితే ఆ దేవుడి దయవల్ల మహేష్ బాబు ప్రాణాలకు ఏ అపాయం కలగలేదు ..వెంటనే డాక్టర్స్ తగిన మెడిసిన్స్ తో ఆయన జ్వరాన్ని కంట్రోల్ చేశారు.. ఆ టైంలో మహేష్ బాబు పై కృష్ణ చాలా కోపంగా ఉన్నారట. అయితే సినిమా హిట్ అయిన తర్వాత కోపం మొత్తం ఎగిరిపోయింది . మహేష్ బాబు కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది మురారి సినిమా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news