Moviesనేను జీవితంలో బ‌తికాను అంటే బాలయ్య ద‌యే… న‌టి సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌

నేను జీవితంలో బ‌తికాను అంటే బాలయ్య ద‌యే… న‌టి సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌

టాలీవుడ్ నటి, యాంకర్.. పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అనిత చౌదరి తెలుగు వెండితెర.. బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న అమ్మాయి. చాలా ఏళ్లుగా సైలెంట్ గా ఉన్న ఆమె తన తాజా ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోని నటసింహం నందమూరి బాలకృష్ణను ఆకాశానికి ఎత్తేశారు.

తన జీవితంలో రెండు మేజర్ ఆక్సిడెంట్లు జరిగాయి.. అందులో మొదటిసారి అమెరికా వెళుతున్న సమయంలో యాక్సిడెంట్ అయింది.. అప్పుడు కస్తూరి సీరియ‌ల్లో నా నటన మెచ్చుకుని సన్మానం చేసేందుకు అక్కడికి ఆహ్వానించారు.. కార్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓట్రక్కు మా కారును ఢీకొట్టడంతో నా కాలర్ బోన్ విరిగిపోయిందని అనిత చౌదరి తెలిపారు. కాలర్ బోన్ విరిగి కుట్లు పడ్డాయి.. ఎంతో కష్టపడి కోలుకున్నా అనుకుంటే కేరింత సినిమా టైంలో మరోసారి పెద్ద యాక్సిడెంట్ అయిందని చెప్పింది.

ఆ టైంలో నేను ఇక్కడ ఉండలేను అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుందామని అనుకున్న.. కానీ నాకు ఇక్కడే బాలకృష్ణ గారి దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించారు.. స్వయంగా హాస్పిటల్ కి వచ్చి వాళ్ళ హాస్పిటల్ నుంచి డాక్టర్లను తీసుకు వచ్చారు.. నాకు తెలిసిన సన్నిహితురాలు బాలకృష్ణ గారితో చాలా క్లోజ్.. ఆయనకు ఫ్యామిలీ ఫ్రెండ్. దాంతో ఆమె నా గురించి, నా ఆక్సిడెంట్ గురించి బాలకృష్ణ గారికి చెప్పిందని అనిత చౌదరి తెలిపింది.

వెంటనే బాలయ్య గారు స్పందించి నా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నా భర్త అమెరికాలో ఉంటే ఆయనతో మాట్లాడి ధైర్యం చెప్పి నాకు ట్రీట్మెంట్ చేయించారు.. నిజంగా సాయం చేయాలంటే అంత చేయాల్సిన అవసరం లేదు.. కానీ ఆయన నా పట్ల చాలా కేర్ తీసుకున్నారు.. ఆయన వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అని అనిత చౌదరి ఎమోషనల్ గా కామెంట్స్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news