Moviesవాట్..స్టేజి పై విజయ్ దేవరకొండని షర్ట్ విప్పమని చెప్పింది ఆయనేనా..? బయటకొచ్చిన...

వాట్..స్టేజి పై విజయ్ దేవరకొండని షర్ట్ విప్పమని చెప్పింది ఆయనేనా..? బయటకొచ్చిన సంచలన నిజం..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో అంతా రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరే మారుమ్రోగిపోతుంది. దానికి కారణం రీసెంట్గా ఆయన నటించిన ఖుషి మూవీ ఈవెంట్లో షర్ట్ తీసేసి మరి సమంతను ఎత్తుకొని డ్యాన్స్ స్టెప్పులు వేయడమే కారణం అంటూ తెలుస్తుంది. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఖుషి . సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించగా హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ సమంత నటించింది. రీసెంట్ గా ఖుషి ఈవెంట్ లో సమంత – విజయ్ దేవరకొండ పర్ఫార్మ్ చేసిన డ్యాన్స్ ఎంత హైలెట్గా మారిందో మనకు తెలిసిందే. ఎంతలా అంటే కొంతమంది ఈ డ్యాన్స్ వీడియోతో సమంత ఈజ్ బ్యాక్ ..మళ్లీ ఆమె ఫేస్ లో ఆనందం చూసామంటుంటే.. మరికొందరు స్టేజిపై షర్ట్ తీసేసి ఆ రొమాన్స్ ఏంట్రా బాబు అంటూ బూతులు తిడుతున్నారు .

అయితే ఎట్టకేలకు ఎందుకు విజయ్ దేవరకొండ షర్ట్ తీసేసి సమంతని ఎత్తుకోవాల్సి వచ్చింది అనే విషయం బయటకు వచ్చింది . నిజానికి విజయ్ దేవరకొండ స్టేజ్ పై షర్ట్ తీయ్యాలని అనుకోలేదు . నార్మల్గా సమంతతో నాలుగు స్టెప్పులు వేద్దామనుకున్నాడు. అయితే డైరెక్టర్ శివ నిర్వాణ ఈ విధంగా షర్ట్ తీసేసి సమంతని ఎత్తుకొని మరి స్టెప్స్ వేయమని సజెస్ట్ చేశారట . తద్వారా సినిమాకి పబ్లిసిటీ .. పాపులారిటీ రావడంతో పాటు హిట్ కోసం పరితపిస్తున్న విజయ్ కి హిట్ పడే ఛాన్స్ కూడా ఉంది అంటూ చెప్పుకు వచ్చారట. వేరే గత్యంతరం లేక రౌడీ హీరో అది తప్పు అని తెలిసిన తప్పక చేసాడు అంటున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్. దీంతో ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news