Movies"దేవర" నుండి అద్దిరిపోయే మ్యాటర్ లీక్.. జాన్వీ కపూర్ పేరు ఏంటో...

“దేవర” నుండి అద్దిరిపోయే మ్యాటర్ లీక్.. జాన్వీ కపూర్ పేరు ఏంటో తెలుసా..? హిట్ కొట్టేసావ్ పోవయ్య కొరటాల..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్గా నటిస్తున్న సినిమా “దేవర”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ రిలీజ్ అయిన ఫ్యాన్స్ నానా హంగామ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎప్పుడెప్పుడు థియేటర్లో మెరవబోతున్నాడా..? ఎన్టీఆర్ అంటూ ఆశగా ఎదురుచూసిన నందమూరి ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్ లీకై వైరల్ గా మారింది. కాగా సాధారణంగా రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఎలాంటి హీరో అయినా సరే ఎంత పెద్ద డైరెక్టర్ తో తీసిన ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న నమ్మకం అందరిలోనూ ఉంది.

ఇప్పటివరకు చరిత్ర కూడా అదే చెప్తూ వచ్చింది. అయితే దేవర విషయంలో మాత్రం చరిత్ర తిరగరాయబోతున్నాడు ఎన్టీఆర్ అంటూ హింట్ వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన అప్ డేట్స్ మొత్తం సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాయి. నిన్న రిలీజ్ అయిన సైఫ్ అలీ ఖాన్ “భైరవ” లుక్ కూడా అభిమానులను తెగ అట్రాక్ట్ చేసింది . ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది. సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వి కపూర్ పేరు “దేవిక” అంటూ ప్రచారం జరుగుతుంది .

ఈ సినిమాలో ఎన్టీఆర్ జాన్వికపూర్ బావ మరదలుగా కనిపించబోతున్నారట . అంతేకాదు ఈ సినిమా ఆఖరిలో జాన్వీ కపూర్ చనిపోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాతే ఎన్టీఆర్ తనలోని వైల్డ్ యాంగిల్ ను బయట పెట్టబోతున్నాడు అంటూ న్యూస్ లీకై వైరల్ అయింది . మొత్తానికి ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ షేడ్ లో చూపించబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అంతే కాదు చాలా కాలం తర్వాత మళ్లీ “ఆది” రేంజ్ లోని మాస్ డైలాగ్స్ సినిమాలో మనం వినబోతున్నాం అంటూ సినీ వర్గాలలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది . దేవర గా ఎన్టీఆర్… దేవికగా జాన్వీ కపూర్ ..వీళ్ల కాంబో రొమాన్స్ తెరపై ఎలా ఉండబోతుందో..? అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . చూడాలి మరి 5 ఏప్రిల్ 2024 ఎన్టీఆర్ కి ఏ విధంగా కలిసొస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news