Movies"మొరగని కుక్కలేదు. విమర్శించని నోరు లేదు"..రజినీకాంత్ సంచలన కామెంట్స్ వైరల్..!!

“మొరగని కుక్కలేదు. విమర్శించని నోరు లేదు”..రజినీకాంత్ సంచలన కామెంట్స్ వైరల్..!!

కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ ప్రజెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా “జైలర్”. ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా నటిస్తుంది . కాగా ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి . మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే తాజాగా జైలర్ ఆడియో విడుదల వేడుక సందర్భంగా రజనీకాంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

భాషతో సంబంధం లేకుండా ఆయన మాట్లాడిన మాటలు పలికించిన ఎక్స్ప్రెషన్స్ చూసి అభిమానులను ఫిదా అయిపోయారు . ఇందుకు సంబంధించిన వీడియో ప్రసెంట్ వైరల్ గా మారింది. కాగా రజనీకాంత్ నటించిన జైలర్ ఆడియో విడుదల వేడుక సందర్భంగా స్టేజిపై మాట్లాడుతూ “మొరగని కుక్క లేదు..విమర్శించని నోరు లేదు .. ఈ రెండు జరగని ఊరే లేదు ..మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి “..అని తమిళంలో చాలా గట్టిగా కూసింత ఘాటుగానే చెప్పుకొచ్చారు.

అంతేకాదు చివరలో తెలుగులో “అర్థమైందా రాజా..?” అంటూ తనదైన స్టైల్ లో చెప్పగానే ఆడిటోరియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది . అయితే ఈ వ్యాఖ్యలు రీసెంట్గా ఆయనపై వైసీపీ నాయకులు చేసిన కామెంత్స్ కి కౌంటర్ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి రజనీకాంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news