Moviesగుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి రా..? నిజంగా పుష్ప2 టైటిల్...

గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి రా..? నిజంగా పుష్ప2 టైటిల్ సాంగ్ బాగుందా..? బన్నీ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్న స్టార్ హీరో అభిమానులు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2 ది రూల్. గతంలో ఆయన కెరియర్లు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నటించిన పుష్ప వన్ సినిమాకి ఈ మూవీ సీక్వెల్ గా రాబోతుంది . ఈ మూవీపై ఎలాంటి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో అభిమానులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . రీసెంట్గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. గతంలో సుకుమార్ మాట ఇచ్చిన విధంగానే మే ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు ఈ పాటను రిలీజ్ చేశారు .

ఈ లిరికల్ వీడియో అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది . మరి ముఖ్యంగా ఈ లిరిక్స్ చంద్రబోస్ పుష్ప రాజ్ క్యారెక్టర్ కి తగ్గట్టే రాసాడు అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఏ మాటకు ఆ మాటే చంద్రబోస్ చాలా చక్కగా రాశాడు లిరిక్స్ అంటూ పలువురు సినీ ప్రముఖులు కూడా మెచ్చుకుంటున్నారు. అయితే పలువురు జనాలు మాత్రం పుష్ప2 కన్న పుష్ప 1 సాంగ్స్ బాగున్నాయి అంటూ సోషల్ మీడియాలో బన్నీ ఫాన్స్ ని రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేస్తున్నారు .

గతంలో పుష్ప సినిమా నుంచి ఫస్ట్ రిలీజ్ అయిన దాకో దాకో మేక సాంగ్ కి ఇప్పుడు రిలీజ్ అయిన పుష్ప పుష్ప ని కంపేర్ చేస్తూ అసలు దేవిశ్రీప్రసాద్ ఏ మ్యూజిక్ ఇచ్చాడు ..ఏదో గులకరాళ్లు డబ్బాలో వేసి డబ్బా డబ్బా వాయించినట్టే ఉంది కానీ అది మ్యూజిక్ కా..? అంటూ మండిపడుతున్నారు . అంతేకాదు కొంతమంది బన్నీ ఫాన్స్ ని రెచ్చగొడుతూ కావాలని గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి ..నిజంగానే ఈ పాట మీకు నచ్చిందా..? పుష్ప వన్ సాంగ్స్ బాగున్నాయా..? పుష్ప2 సాంగ్ బాగుందా..? అంటూ కావాలనే గిల్లి గిచ్చి గొడవ పెట్టుకుంటున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అలాంటి వాళ్లకు దిమ్మతిరిగే రేంజ్ లో కౌంటర్స్ కూడా ఇస్తున్నారు బన్నీ ఫాన్స్ . మొత్తానికి సినిమా రిలీజ్ అవ్వకముందే పెద్ద రాద్ధాంతమే సృష్టిస్తున్నారు ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ . కానీ బన్నీ అభిమానులు మాత్రం సైలెంట్ గానే ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news