Movies"అదంతా కూడా కేవలం సె* కోసమే".. పచ్చిగా చెప్పేసిన పూరి జగన్నాథ్..సెన్సేషనల్...

“అదంతా కూడా కేవలం సె* కోసమే”.. పచ్చిగా చెప్పేసిన పూరి జగన్నాథ్..సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

పూరి జగన్నాథ్ .. ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ట్ డైరెక్టర్ .. డేరింగ్ అండ్ డాషింగ్ అనగానే మనకి ఈ పేరే గుర్తొస్తుంది . అంతలా పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్నాడు. అయితే సడన్ గా ఆయన క్రేజ్ మొత్తం డమాల్ అంటూ పడిపోయింది . దానికి కారణాలు ఏవైనా కావచ్చు.. ఎన్నెన్నో ఉన్నాయి కూడా.. మరీ ముఖ్యంగా లైగర్ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని తెరకెక్కించారు . ఈ సినిమా దారుణాతి దారుణంగా ఫ్లాప్ అయింది . ఆ తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా గోడ ఎక్కింది .

త్వరలోనే పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా గుడ్ బై చెప్పి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . పూరి జగన్నాథ్ ఏ విషయాన్నైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా పూరి మ్యూజిక్స్ అనే ఒక ఛానల్ క్రియేట్ చేసి కొన్ని ఆసక్తికర వీడియోలను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా వీడియోలు రిలీజ్ చేశారు ..చాలామంది ప్రేమ ప్రేమ అంటూ మోసపోతూ ఉంటారు అని .. ప్రేమలో విఫలమైతే తిండి మానేసి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అని ..అదంతా ఫేక్ అని కేవలం.. సెక్స్ కోసం మాత్రమే అలా చేస్తారు అని ..పచ్చిగా ఉన్నది ఉన్నట్లు చెప్పేశాడు .

జీవితంలో చాలా మంది ప్రేమలో ఫెయిల్ అవుతూ ఉంటారు . ఆ టైంలో తిండి తినాలనిపించదు .. నిద్ర రాదు గుండెల్లో తెలియని మంట .. దానికి తోడు మందు అలవాటు నేర్చుకుంటారు . స్నేహితులు ఓదార్చిన ఆ బాధ తీరదు.. కొన్నిసార్లు ఏం చేస్తామో మనకే తెలియదు .. చాలామంది దీన్ని ప్రేమ అనుకుంటారు. నో అది ఈగో నీకు ఎంత ఈగో ఉంటే అంత నరకం చూస్తావు ..అది నిజం నీకు దక్కలేదు అన్న ఉక్రోసమే అది ..ప్రేమ కానే కాదు .. మీ అమ్మ కంటే నేను ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తారా..? అమ్మకోసం ఏనాడైనా చేతులు కోసుకున్నావా? ఏడ్చావా? అదంతా ఫేక్ నువ్వు కేవలం శృంగారం కోసం మాత్రమే అమ్మాయిలను ప్రేమిస్తావు .. అదంతా మాయ మత్తులో జరుగుతుంది ..అంటూ నేటి యువత తప్పుదారి పడుతున్న విధానాన్ని కళ్ళకు కట్టినట్లు పచ్చిగా బోల్డ్ గా చెప్పుకొచ్చారు . పూరి జగన్నాథ్ కి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news