Movies' జైల‌ర్ ' ప్రి రిలీజ్ బిజినెస్‌... ర‌జ‌నీ క్రేజ్ ఇంత‌కు...

‘ జైల‌ర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… ర‌జ‌నీ క్రేజ్ ఇంత‌కు ప‌డిపోయిందా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. ఇటీవల రజనీకాంత్ నటించిన సినిమాలు అంచనాలు అందుకోవటం లేదు. అయితే జైలర్ సినిమా టీజర్.. ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాపై ఒక్కసారిగా భారీ హైప్‌ వచ్చింది. సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ మొదలయ్యాయి.

ఇక ఈ సినిమా థియేటర్ బిజినెస్ ఎంత ? జరిగింది. రజిని టార్గెట్ ఎంత ? అన్న లెక్కలు ట్రేడ్ వర్గాలలో ఆసక్తిగా మారాయి. తమిళనాడులో ఈ సినిమాకు రు. 60 కోట్ల రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటకలో జైలర్ రైట్స్ రు. 10 కోట్లకు అమ్ముడు అయ్యాయి. ఇక ఏపీ – తెలంగాణలో ఈ డీల్ రు. 12 కోట్లకు క్లోజ్ అయింది. కేరళలో రు. 5.5 కోట్లకు రైట్స్ అమ్ముడయ్యాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రు. 4 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేసినట్టు టాక్.

ఇక ఓవరాల్ ఇండియా వైడ్‌గా జైలర్ సినిమా రు. 91 కోట్ల రేంజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ లో ఈ సినిమా రైట్స్ ఏకంగా రు. 32 కోట్లకు అమ్ముడయ్యాయి. వరల్డ్ వైడ్‌గా జైలర్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ రు. 123 కోట్లు జరిగినట్టు తెలుస్తోంది. అంటే జైలర్ బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావాలంటే రు. 124 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. అంటే దాదాపు రు. 250 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు రాబట్టాలి.

రజ‌ని స్టామినాను బట్టి చూస్తే ఈ ఫ్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎక్కువ కాదని చెప్పాలి. అయితే రోబో సినిమాల తర్వాత రజనీకాంత్ నటిస్తున్న ప్రతి సినిమాకు ఎంతో కొంత నష్టం వస్తూనే ఉంది. మరి ఈసారి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ మ్యూజిక్ పనిచేస్తుందా ? జైలర్ తో అయినా రజిని సూపర్ హిట్ కొట్టి తన అభిమానుల కరువు తీర్చేస్తాడా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news