Moviesఅన్ని నీతులు చెప్పే రాజమౌళి ..ఆ నీతి ఆయనలా మరిచాడు..? ఒక్క...

అన్ని నీతులు చెప్పే రాజమౌళి ..ఆ నీతి ఆయనలా మరిచాడు..? ఒక్క తప్పుతో అడ్డంగా దొరికిపోయిన జక్కన్న..!

పాపం .. ఎప్పుడు పొగడ్తలతో ముంచేత్తే జనాలు ఈసారి రాజమౌళిని దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . దానికి కారణం ఆయన రీసెంట్గా అనౌన్స్ చేసిన బాహుబలి 3 ప్రాజెక్టు . రాజమౌళి పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది బాహుబలి . అఫ్ కోర్స్ రాజమౌళి తన కెరియర్ లో ఎన్నో సినిమాలను తెరకెక్కించారు అన్ని సూపర్ డూపర్ హిట్సే . కానీ రాజమౌళి కెరియర్ను తిరగరాసిన సినిమా మాత్రం కచ్చితంగా బాహుబలి అనే చెప్పాలి .

తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా ప్రపంచ దేశాలకు తెలుగు సినిమా ఖ్యాతిని పాకేలా చేసింది . ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా రానా దగ్గుబాటి విలన్ గా అనుష్క శెట్టి – తమన్న హీరోయిన్గా నటించారు. ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమా ద్వారా రాజమౌళి మరింత హ్యూజ్ పబ్లిసిటీ కూడా దక్కించుకున్నాడు. ఆయన రేంజ్ మారిపోయింది.

రీసెంట్గా బాహుబలి సినిమాకు 3 ని అనౌన్స్ చేశాడు రాజమౌళి . బాహుబలి 3 క్రోన్ అండ్ బ్లడ్ అంటూ టైటిల్ కూడా రివీల్ చేశారు . త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం అంటూ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఆనిమేటెడ్ సిరీస్ లో రాబోతుంది అంటూ చెప్పుకొచ్చారు. జనరల్ గా రాజమౌళి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఏదైనా ఒక సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు మిగతా సినిమాకి కమిట్ అవ్వడు . అది అందరికీ తెలిసిందే .

కేవలం రాజమౌళినే కాదు రాజమౌళితో వర్క్ చేసే హీరో కూడా ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వకూడదు అని .. కొన్ని రూల్స్ పెడతాడు …అయితే ఫర్ ద ఫస్ట్ టైం రాజమౌళి తన కెరియర్ లో రూల్స్ బ్రేక్ చేశాడు . ఆల్రెడీ మహేష్ బాబుతో ఒక ప్రాజెక్టు తెరకెక్కించడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఎలా ఆ ఆనిమేటెడ్ సిరీస్ ను అనౌన్స్ చేస్తాడు అంటూ కావాలనే కొందరు గుచ్చి గుచ్చి రాజమౌళి చేసిన తప్పును ప్రశ్నిస్తున్నారు . మరి కొందరు దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news