Moviesకేకపెట్టిస్తున్న ఎన్టీఆర్ న్యూ లుక్.. ఏమున్నాడు రా బాబు.. అచ్చం టైగర్...

కేకపెట్టిస్తున్న ఎన్టీఆర్ న్యూ లుక్.. ఏమున్నాడు రా బాబు.. అచ్చం టైగర్ లానే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్టీఆర్ అంటే అభిమానులకు విపరీతమైన అభిమానం . ఇష్టం . దానికి కారణం ఏవైనా కావచ్చు సినిమా ఇండస్ట్రీలో తారక్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని .. టాప్ హీరోలలో ఒకరుగా రాజ్యమేలేస్తున్నాడు. రీసెంట్ గానే ఆర్ ఆర్ ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సంబంధించిన కొత్త లుక్ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే తారక్ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు . ఇప్పటికే లీషియస్ , యాపీ ఫిజ్ , మెక్ డొనాల్డ్స్ వంటి యాడ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్.. ఆ యాడ్స్ లో తన లుక్స్ తో వావ్ అనిపిస్తున్నాడు.

ఎన్టీఆర్ కి సంబంధించిన లుక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ యాడ్లో ఎన్టీఆర్ స్టైలిష్ గా కనిపించేలా ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ .. ఎన్టీఆర్ ని అదిరిపోయే లుక్స్ లో రెడీ చేశాడు . గుబురు గడ్డం, కళ్ళకి కళ్ళజోళ్ళు, స్టైలిష్ లుక్ తో వావ్ అనిపించేలా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఈ యాడ్ కోసం ఏకంగా కెరియర్ లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ 10 కోట్లు పుచ్చుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news