Moviesఆ ఒక్కటీ అడక్కు ట్విట్టర్ రివ్యూ: అల్లరోడు ఈ రేంజ్ లో...

ఆ ఒక్కటీ అడక్కు ట్విట్టర్ రివ్యూ: అల్లరోడు ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు ఏంటి..? అలాంటి మగాళ్లు తప్పక చూడాల్సిన సినిమా..!

గత కొంతకాలంగా హిట్ లేకుండా అల్లాడిపోతున్న అల్లరి నరేష్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనకు తెలిసిందే. ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమాలు బాగా బాగా ఆకట్టుకునేవి . అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయింది . అల్లరి నరేష్ సినిమాలు అస్సలు జనాలను ఆకట్టుకోవడం లేదు. ఆయన క్రేజ్ కూడా ఢమాల్ అని పడిపోయింది. ఈ క్రమంలోనే ఎలాగైనా సరే తన పేరుకి పునర్ వైభవం తీసుకురావాలి అని అల్లరి నరేష్ ఎంతో పకడ్బందీగా ప్లాన్ వేసుకుంటున్నాడు .

ఈ క్రమంలోనే ఆయన తాజాగా నటించిన సినిమా “ఆ ఒక్కటి అడక్కు”. హైదరాబాద్ బ్యూటీ ఫరీయా అబ్దుల్లా ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కొన్ని పోస్టర్స్ అభిమానులకు హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. తాజాగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది . ఫుల్ టు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను మెప్పించిందా..? లేదా..? అనే విషయం ఇక్కడ చదివి తెలుసుకుందాం.

అల్లరి నరేష్ సినిమాలు అంటే కచ్చితంగా కామెడీ ప్రధానంగా ఉంటుంది. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. అయితే ఆ ఒక్కటి అడక్కు సినిమాలో కూడా అల్లరి నరేష్ ఎక్కువగా కామెడీ వైపే వెళ్లే విధంగా ప్రయత్నం చేశాడు . ఈ మూవీలో అల్లరి నరేష్ పెళ్ళికాని ప్రసాద్ రోల్ లో చించేసాడనే చెప్పాలి . ఓ పక్క ఏజ్ బార్ అవుతున్న అమ్మాయి దొరక్క ఇబ్బంది పడే యువకుడు పాత్ర చేసాడు ..నటించలేదు జీవించడమే చెప్పాలి .

సోషల్ బర్నింగ్ టాపిక్ తో కామెడీ చేయాలనుకున్న అల్లరి నరేష్ ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదు.. ఇది ఒక దశాబ్ద కాలంగా వేధిస్తున్న సమస్య పెళ్లి ప్రయత్నం చేసుకున్న కుర్రాలకు సంబంధించిన కొన్ని వార్తలు కూడా మనం విన్నాం. ఆ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ నే ఇది . సరిగా అబ్దుల్లా కూడా తనదైన స్టైల్ లో బాగా ఆకట్టుకుంది . పెళ్లిని బిజినెస్ గా మార్చేసిన విధానాన్ని డైరెక్టర్ కళ్ళకు కట్టినట్లు చూపించాడు .

పద్ధతులు ఈ సినిమా కామెడీని మరింత పెంచే ప్రయత్నం చేశాయి . ఒక విధంగా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో కడుపుబ్బ నవ్వుకొని చాలా కాలమే అయింది . అలాంటి వాళ్ళకి ఈ సినిమా ఎక్కడా కూడా వల్గారిటీ లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా చాలా క్లియర్ గా రియలిస్టిక్ గా చూపించారు డైరెక్టర్ . మరీ ముఖ్యంగా వెన్నెల కిషోర్ వైవాహర్ష కామెడీ పండించడంలో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు అని చెప్పాలి . ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిన సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ టు ఫుల్ కామెడీ తో నెట్టుకొచ్చాడు డైరెక్టర్ . సందేశం తో కూడిన హాట్ సీన్స్ డైలాగ్స్ కధని మలుపు తిప్పాయి. క్లైమాక్స్ బాగుంది.. ఓవరాల్ గా ఒక్కసారి సినిమా చూడొచ్చు అంటూ జనాలు రివ్యూ ఇస్తున్నారు చూద్దాం..ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news