Moviesటబు కి నాగార్జున పెట్టిన ముద్దు పేరు ఏంటో తెలుసా..? ...

టబు కి నాగార్జున పెట్టిన ముద్దు పేరు ఏంటో తెలుసా..? హౌ రొమాంటిక్ ఈ అక్కినేని హీరో..!

సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ క్యూట్ రొమాంటిక్ ఆన్ స్క్రీన్ పెయిర్ అక్కినేని నాగార్జున హీరోయిన్ టబు . ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? వామ్మో అప్పట్లో వీళ్ళ గురించి ఎలాంటి వార్తలు వినిపించాయో మనకు బాగా తెలుసు . మరీ ముఖ్యంగా వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం జనాలలో వీళ్ళకి ఉండే క్రేజ్ ని ప్రత్యక్షంగా చూపించింది .

అంతేకాదు ప్రతి సినిమాలోను వీళ్ళ రొమాన్స్ హైలెట్గా మారేది . మరీ ముఖ్యంగా వీళ్ళ కాంబోలో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా ఎంత హిట్ అయింది అనేది చెప్పాలి అంటే .. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తూ ఉంటే జనాలు ఓ రేంజ్ లో చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు . మరీ ముఖ్యంగా లవర్స్ ఈ సినిమాకి ఫిదా అవుతూ ఉంటారు . ఈ సినిమాలోని పాటలు కూడా చాలా బాగుంటాయి . అయితే నాగార్జునకి టబుకి మధ్య ఏదో సంబంధం నడుస్తుంది అంటూ టాలీవుడ్ బాలీవుడ్ మీడియా కోడై కూసింది .

పలు సార్లు వీళ్ళు అఫీషియల్ గా కూడా దానిపై రియాక్ట్ అయ్యారు. మా మధ్య ఫ్రెండ్షిప్ తప్పిస్తే ఏమీ లేదు అని ..అమలకు కూడా మా ఫ్రెండ్ షిప్ తెలుసు అని నాగార్జున ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు . అయితే ఇలాంటి క్రమంలోనే నాగార్జున టబుకు పెట్టిన ముద్దు పేరు వైరల్ గా మారింది. ఒక గ్రాండ్ ఈవెంట్లో బయటపెట్టాడు నాగ్. గతంలో వజ్రోత్సవ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే.

అప్పుడు టబు పక్కనే ఉన్న నాగార్జున ఆమెకు పెట్టిన ముద్దు పేరును రివీల్ చేశారు. నిన్నే పెళ్ళాడుతా సినిమాలో పండు పండు అంటూ బాగా ఏడిపించారు గుర్తుందా..? ఆ సీన్ మర్చిపోగలమా ..?ఆ పండు అనే పేరునే ఇప్పటికీ నాగార్జున టబును ముద్దుగా పిలుస్తూ ఉంటారట . ఈ విషయాన్ని మరోసారి జనాలు అభిమానులు ట్రెండ్ చేస్తూ ఉండడం గమనార్హం. ప్రజెంట్ సీనియర్ పాత్రలో టబు ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటిస్తుంది. నాగార్జున కూడా తన 100వ సినిమా కోసం భారీ స్థాయిలో కసురత్తులు చేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news