Movies"చిరాకు దొబ్బితే అదే చేస్తా..వైల్డ్ ఆన్సర్ ఇచ్చిన మహేశ్ బాబు".. ఫ్యాన్స్...

“చిరాకు దొబ్బితే అదే చేస్తా..వైల్డ్ ఆన్సర్ ఇచ్చిన మహేశ్ బాబు”.. ఫ్యాన్స్ షాక్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు .. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బ్రాండెడ్ ప్రాడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న విషయం తెలిసిందే . కాగా రీసెంట్గా ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బిగ్ సి 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఈవెంట్ కు హాజరైన మహేష్ బాబు మీడియాతో ముచ్చటించారు .కాగ పలువురు రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తూనే ఫన్నీ కౌంటర్స్ కూడా వేశారు.

ఇలాంటి క్రమంలోనే గుంటూరు కారం సినిమాకి సంబంధించిన విషయాలలో ఘాటుగా స్పందించిన మహేష్ బాబు ..అదే సమయంలో” మీరు ఎక్కువ సేపు మొబైల్ యూస్ చేస్తారా..?” అన్న ప్రశ్నకు “అందరిలాగే నేను కూడా మొబైల్ యూస్ చేస్తాను ..అది ఎక్కువ సేపా తక్కువ సేపు అని చెప్పలేను “అంటూ రిప్లై ఇచ్చాడు.

అంతే కాదు ఉదయం లేచిన తర్వాత పడుకునే ముందు మొబైల్ చూస్తారా..? అంటే అందరిలాగే చూస్తాను అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు కొన్నిసార్లు పదేపదే స్మార్ట్ ఫోన్ చూడడం వల్ల తలనొప్పి వస్తుందని అలా తలనొప్పి వచ్చినప్పుడు చిరాకు వస్తే ఫోన్ పక్కన పడేస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు తనకి మొబైల్లో గేమ్‌స్ ఆడటం అంటే ఇష్టం అంటూ కూడా ఓపెన్ అప్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news