Moviesలాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చిన శ్రీలీల.. 'గుంటూరు కారం' కు...

లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చిన శ్రీలీల.. ‘గుంటూరు కారం’ కు పెద్ద సమస్యే వచ్చి పడ్డిందే..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ ముహూర్తాన స్టార్ట్ అయిందో కానీ .. అప్పటినుంచి వరుసగా బ్రేకులు పడుతూనే వచ్చాయి . కాగా సినిమాకి ఒక్కదాని తర్వాత ఒకటి ఆటంకం కలుగుతూనే ఉంది . మొదటగా హీరోయిన్ అనుకున్న పూజా హెగ్డే ని తప్పించారు .

ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను తప్పిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఫైనల్లి శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా సెటిల్ అయ్యారు. అయితే ఇప్పుడు హీరోయిన్ శ్రీ లీల గుంటూరు కారం సినిమా విషయంలో మేకర్స్ ని ఇబ్బందిపడుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . గుంటూరు కారం సినిమాలో కేవలం పెద్ద స్టార్స్ నే కాదు చిన్న స్టార్స్ కూడా ఉన్నారు. అయితే కాల్ షీట్స్ అడ్జస్ట్ అయ్యి సినిమా షూట్ స్టార్ట్ చేసే క్రమంలో శ్రీ లీల కాల్ షీట్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.

మహేష్ బాబు మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి ఉంది. అయితే వేరే సినిమా షూట్స్ లో బిజీగా ఉన్న శ్రీలీల గుంటూరు కారం కు కాల్ షీట్స్ ఇవ్వలేను అంటూ త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇచ్చేసిందట . ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది . త్వరలోనే మళ్లీ మహేష్ బాబు వెకేషన్ కి వెళ్ళిపోతున్నాడు. ఆలోపు ఈ సినిమా షూట్ కంప్లీట్ చేయాలని ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్ . అయితే ఈ సినిమా షూట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ..? లేదో..? ఆ దేవుడికి తెలియాలి అంటూ ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news