Moviesభ‌గ‌వంత్ కేస‌రికి మ‌రో ముహూర్తం పెట్టిన బాల‌య్య‌.. ఆగ‌స్టులోనే…!

భ‌గ‌వంత్ కేస‌రికి మ‌రో ముహూర్తం పెట్టిన బాల‌య్య‌.. ఆగ‌స్టులోనే…!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెర‌కెక్కుతోన్న సినిమా భ‌గ‌వంత్ కేస‌రి. వ‌రుస హిట్ సినిమాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై క‌నివినీ ఎరుగ‌ని రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. కంప్లీట్ సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామాగా “భగవంత్ కేసరి” సినిమా తెర‌కెక్కుతోంది.

ఇక ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే వ‌చ్చిన టీజ‌ర్ అయితే గూస్‌బంప్స్ మోత మోగించేస్తోంది. బాల‌య్య నేల‌కొండ భ‌గ‌వంత్ కేస‌రి అంటూ చెప్పిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ ఒక్క‌టి వింటుంటేనే రొమాలు నిక్క‌పొడుచుకుంటున్నారు. రేపు థియేట‌ర్ల‌లో బాల‌య్య డైలాగుల‌తో మోత మోగిపోయేలా ఉంది. ఇక అక్టోబ‌ర్ 19న భ‌గ‌వంత్ కేస‌రిగా బాల‌య్య బాక్సాఫీస్ వ‌ద్ద గ‌ర్జింజ‌నున్నాడు.

ఇక ఈ సినిమా నుంచి వ‌స్తోన్న ఒక్కో కంటెంట్ ప్ర‌మోష‌న్ ప‌రంగా ఎంతో హైప్‌కు తీసుకు వెళుతోంది. ఓ వైపు సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా న‌డుస్తోంది. లేటెస్ట్ బ‌జ్ ప్ర‌కారం ఆగ‌స్టు మూడో వారం నుంచి భగవంత్ కేసరి మేనియా స్టార్ట్ కానుంది. అక్కడ నుంచి నందమూరి ఫ్యాన్స్ ఉత్సాహం పీక్స్‌కు వెళ్లిపోనుంది. అక్క‌డ నుంచి క్ర‌మ‌క్ర‌మంగా ఒక్కో అప్‌డేట్ వ‌దులుకుంటూ వెళ‌తారు.

ఇక సినిమా రిలీజ్ టైంకు ప్ర‌చారం పీక్స్‌కు వెళ్లేలా బాలయ్యే స్వ‌యంగా ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, శ్రీలీల తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండ‌గా.. షైన్ స్క్రీన్ సినిమాస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news