Moviesగేమ్ చేంజ‌ర్ బిగ్గెస్ట్ డిజ‌ప్పాయింట్ న్యూస్ ఇది..!

గేమ్ చేంజ‌ర్ బిగ్గెస్ట్ డిజ‌ప్పాయింట్ న్యూస్ ఇది..!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా త‌ర్వాత వ‌స్తోన్న సినిమా అంటే ఎట్లా ఉండాలి.. అదిరిపోవాలి. అస‌లు చిన్న అప్‌డేట్ కూడా హోరెత్తిపోవాలి.. సినిమాకు క‌నీసం ఏడెనిమిది నెల‌ల నుంచే మోత మోగిపోవాలి. కానీ చ‌ర‌ణ్ తాజా సినిమా గేమ్ చేంజ‌ర్ సినిమా విష‌యంలో అవేవి ప‌ట్ట‌డం లేదు. అస‌లు ఫ్యాన్స్ ఆవేద‌న కూడా మేక‌ర్ల‌కు ప‌ట్ట‌డం లేదు. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్‌, పైగా కియారా అద్వానీ లాంటి స్టార్ హీరోయిన్‌.. ఇటు దిల్ రాజు లాంటి నిర్మాత‌.. వీళ్లంద‌రూ ఉన్నా కూడా ఈ సినిమాకు ఆ రేంజ్ హైప్ రావ‌డం లేదు.

పేరుకే పాన్ ఇండియా సినిమా అని చెపుతున్నా ఆ రేంజ్‌లో బ‌జ్ ఉందా ? అని ప్ర‌శ్నించుకుంటే ఖ‌చ్చితంగా నో అనే చెప్పాలి. అస‌లు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినా అస‌లు ప్రొసిడింగ్ విష‌యంలో మేక‌ర్స్ ఫ్యాన్స్‌కే సినిమాను క‌నెక్ట్ చేయ‌ట్లేదు. గేమ్ చేంజ‌ర్‌తో పాటు ఎనౌన్స్ అయిన సినిమాలు చ‌క‌చ‌కా అప్‌డేట్స్‌తో ముందుకు వ‌స్తున్నాయి.. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాయి.. భారీ అంచ‌నాలు.. భారీ ప్రి రిలీజ్ బిజినెస్‌తో దూసుకు పోతున్నాయి.

ఇలా పెద్ద సినిమాల అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తుంటే గేమ్‌చేంజ‌ర్ విష‌యంలో క‌నీసం చిన్న‌పాటి అప్‌డేట్లు కూడా రాక‌పోవ‌డంతో ఫ్యాన్స్ బాగా డిజ‌ప్పాయింటింగ్‌గా ఉన్నారు. ముందు సంక్రాంతి రిలీజ్ అన్నారు. త‌ర్వాత సంక్రాంతికి రావ‌ట్లేదు.. స‌మ్మ‌ర్‌కు వాయిదా అంటున్నారు. ఇప్పుడు తీరా సీన్ చూస్తుంటే స‌మ్మ‌ర్‌కు కూడా వ‌చ్చేలా లేదు.

వ‌చ్చే యేడాది ద‌స‌రాకు వెళ్లిపోతుంద‌ని అంటున్నారు. క‌మ‌ల్ ఈ ప్రాజెక్టును కొద్ది రోజులు ఆపేసి అటు క‌మ‌ల్ ఇండియ‌న్ 2 సెట్స్ మీద‌కు వెళ్లిపోయాడ‌ని మ‌రో ప్ర‌చారం కూడా ఉంది. దీనికి తోడు బ‌డ్జెట్ విష‌యంలో దిల్ రాజుకు, శంక‌ర్‌కు మ‌ధ్య గ్యాప్ కూడా వ‌చ్చేసిందంటున్నారు. ఏదేమైనా గేమ్‌చేంజ‌ర్ ప‌రిస్థితి అయోమ‌యం గంద‌ర‌గోళంగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news