Moviesబాల‌య్య - చిరు అన్‌స్టాప‌బుల్ సెట్ చేసింది ఎవ‌రంటే.. తెర‌వెన‌క ఏం...

బాల‌య్య – చిరు అన్‌స్టాప‌బుల్ సెట్ చేసింది ఎవ‌రంటే.. తెర‌వెన‌క ఏం జ‌రిగింది..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ ఆహాలో చేసిన అన్‌స్టాప‌బుల్ ఒక క్రేజీ ప్రోగ్రాం. అన్‌స్టాప‌బుల్ సీజన్ వన్తో బాలయ్య పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత ఆహాకు అది ఒక ఐకానికి ప్రోగ్రాం గా మారిపోయింది. తర్వాత అదే ఊపుతో సీజన్ 2 కూడా చేశారు. సీజన్ 2కు సెలబ్రిటీలు సరిగా దొరకలేదు కానీ బాలయ్య తన యాంకరింగ్ వరకు న్యాయం చేశారు. సీజన్ 2 కు ప్రధానమైన సరైన సెలబ్రిటీలు దొరకకపోవడమే మైన‌స్‌.

ఇక ఇప్పుడు ఆహాలో మరో సరికొత్త ప్రోగ్రాం తెరమీదకు రానుంది. అనుస్టాప‌బుల్ సీజన్ 3 అని ప్లాన్ చేయటం లేదు కానీ.. బాలయ్య తోనే కొన్ని స్పెషల్ ఇంటర్వ్యూలు ప్లాన్ చేసి స్పెషల్ ఎపిసోడ్లుగా ప్రసారం చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ఓ అదిరిపోయే ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్ గా తీసుకువచ్చి బాలయ్యతో ముచ్చట్లు పెట్టించే ప్రణాళిక జరుగుతుంది.

ఈ మేరకు ఆహా తరపున చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య ఇంటర్వ్యూకు చిరంజీవి రావడం ఖరారు అయింది. అయితే బాలయ్య – చిరు డేట్లు సెట్ అయితే ఈ ఎపిసోడ్ తయారుచేసి దసరాకు ప్రసారం చేయాలన్నది ఆహా ప్లాన్. కేవలం అల్లు అరవింద్ ఇటు బాలయ్య తోను.. అటు చిరంజీవితోను చర్చలు జరిపి ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేయించినట్టు తెలుస్తోంది.

అరవింద్ కు చిరంజీవికి మధ్య గ్యాప్ ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. అలాంటి సమయంలో ఆయన డేర్‌ చేసి ఏకంగా బాలయ్య చిరంజీవిని ఇంటర్వ్యూ చేయ‌డం ప్లాన్ చేయటమంటే నిజంగా ఆయన తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. రేపటి రోజున ఈ ఇంటర్వ్యూ ప్రసారం అయితే కచ్చితంగా తెలుగు జ‌నాల్లోనూ, టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ అవుతుందటంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news