Moviesహీరోగా వైష్ణవి చైతన్య బ్రదర్.. కుర్రాడిలో అంత మ్యాటర్ ఉందా..? అప్పుడే...

హీరోగా వైష్ణవి చైతన్య బ్రదర్.. కుర్రాడిలో అంత మ్యాటర్ ఉందా..? అప్పుడే దించేస్తున్నారే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య పేరే మారుమ్రోగిపోతుంది. ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ చేసిన మూవీ బేబీ . పెట్టిన దానికి ఏకంగా ఐదు రెట్లు లాభాలు తీసుకొచ్చిన ఈ సినిమా 75 కోట్లు కలెక్ట్ చేసింది. టాలీవుడ్ స్టార్స్ ఇప్పటికే రామ్ పోతినేని – మెగాస్టార్ చిరంజీవి- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ఎందరో బేబీ సినిమా టీంకు ప్రత్యేకంగా విష్ చేసిన సంగతి తెలిసిందే .

కాగా ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే . సినిమా సక్సెస్ తర్వాత బేబీ మూవీ టీం విజయ్ దేవరకొండ ని కలిసింది . ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య – ఆనంద్ దేవరకొండ – విజయ్ దేవరకొండ తో చాలా చనువుగా ఫొటోస్ దిగారు . అయితే ఇంతవరకు ఓకే బాగానే ఉంది.

కానీ వైష్ణవి చైతన్య తమ్ముడు విజయ్ దేవరకొండ పక్కన ఫోటోలు దిగడం ఆ ఫోటోలో కూడా ఆయన హెడ్ వెయిట్ గా బిహేవ్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అతడేదో పెద్ద స్టార్ హీరో లాగా విజయ్ దేవరకొండ పక్కన ప్రవర్తించాడు అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు . ఆయన పైన చేయి వేసి ఫోటో దిగే మగాడివారా..? నువ్వు అంటూ ఫైర్ అవుతున్నారు .

అంతేకాదు నీ టెక్ చూస్తుంటే త్వరలోనే ఇండస్ట్రిలో హీరోగా ఎంట్రీ ఇచ్చే మాదిరిగానే ఉన్నావే అంటూ మరి కొంతమంది జనాలు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వైష్ణవి చైతన్య బ్రదర్ చేసిన పనికి సోషల్ మీడియాలో అడ్డంగా ఇరుకుని ట్రోల్ అవుతున్నాడు . పాపం తెలిసో తెలియకో చేసిన పని కారణంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆయన్ను ఆడేసుకుంటున్నారు . అంతేకాదు వైష్ణవి చైతన్య చెప్పాలి కదా అంత పెద్ద హీరో పక్కన ఎలా బిహేవ్ చేసేది అంటూ ఫైర్ అవుతున్నారు జనాలు. మరికొందరు వీడు ఇండస్ట్రీలో హీరోగా వచ్చినా వచ్చేలా ఉన్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news