Moviesఆ విషయాని చెప్తూ గుక్క పట్టి ఏడ్చేసిన సోహెల్.. సుమను...

ఆ విషయాని చెప్తూ గుక్క పట్టి ఏడ్చేసిన సోహెల్.. సుమను కూడా ఏడిపించేసాడుగా(వీడియో)..!!

సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకుని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన స్టార్స్ ఎంతోమంది ఉన్నారు . ఆ లిస్ట్ లోకి వస్తాడు సోహెల్ . కాగా బిగ్ బాస్ షో ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ సెలబ్రెటీగా మారిపోయిన సోహెల్ .. ఆ టైంలో ఎంత హంగామా చేశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సోహెల్ మెగాస్టార్ చిరంజీవి ని సైతం ఇంప్రెస్ చేసేసాడు. షో అయిపోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి – అక్కినేని నాగార్జున ఆయనను నెత్తిన పెట్టుకోవడంతో సోహెల్ రేంజ్ మరింత స్థాయిలో మారిపోయింది .

సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాల్లో కూడా నటించారు . అయితే ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. సోహెల్ హీరోగా సినిమా ఇండస్ట్రీలో ” లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు ” అనే చిత్రాలు వచ్చాయి. అయితే రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ క్రమంలోనే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నటించిన సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ . ఈ సినిమాలో సోహెల్ ప్రెగ్నెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు .

అయితే రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోహెల్ సుమ అడ్డ షోకి హాజరయ్యారు. అయితే స్టార్టింగ్ నుంచి ఎంతో సరదాగా చలాకిగా అల్లరిగా మాట్లాడిన సోహెల్ లాస్ట్ లో మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయారు. ” ఇండస్ట్రిలో నన్ను కావాలని తొక్కేస్తున్నారని .. రియాల్టీ షో ద్వారా పాపులారిటీ అయ్యాడు వీడేం పైకి వస్తాడు అని మాట్లాడుతున్నారని.. నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదని .. అంతేకాదు మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా టైంలో అందరు నన్ను తేడాగాడు అంటూ కించపరిచారని హీనంగా చూశారని ” మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు . ఈ క్రమంలోనే ఆయన మాటలు విన్న సుమ – దీప్తి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news