Movies24 గంటల్లో "సలార్" ఆల్ టైం రికార్డ్.. టీజర్ తోనే దుమ్ము...

24 గంటల్లో “సలార్” ఆల్ టైం రికార్డ్.. టీజర్ తోనే దుమ్ము దులిపేసిన ప్రభాస్..ఎన్ని మిలియన్ వ్యూస్ అంటే..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ నటించిన “సలార్” సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు . దానికి మెయిన్ రీజన్ రీసెంట్ గానే ప్రభాస్ నటించిన సలార్ సినిమా టీజర్ ని మేకర్స్ గ్రాండ్గా విడుదల చేశారు . ప్రభాస్ లాంటి స్టార్ హీరోని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోతున్నాడు అని తెలియగానే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ..ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు .

కాగా దానికి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ప్రశాంత్ నీల్ సినిమాను డైరెక్ట్ చేశాడు అని రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది. జూలై 6వ తేదీ 5:12 నిమిషాలకు ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ టీజర్ సూపర్ డూపర్ హిట్ టాక్ ను నమోదు చేసుకుంది . అయితే వేళ కాని వేళలో టీజర్ రిలీజ్ చేసిన సరే .. రెబెల్ ఫాన్స్ టీజర్ కి ఆల్ టైం రికార్డ్ వ్యూస్ రాబట్టారు . 24 గంటల్లోనే “సలార్” సినిమా టీజర్ 83 మిలియన్ల వ్యూస్ రాబట్టి ..ప్రభాస్ కెరియర్ లోనే హైయెస్ట్ రికార్డ్లను నెలకొల్పింది.

గత రికార్డు కి ఇది ఎక్కడో అందనంత ఎత్తులో ఉంది . సలార్ తర్వాత స్థానంలో ఆది పురుష్ ఆ ఘనత దక్కించుకుంది . ఈ క్రమంలోనే ప్రభాస్ సలార్ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు . మొత్తంగా చూసుకుంటే బాహుబలి తర్వాత ఆ స్థాయి హిట్ ప్రభాస్ కి అందించే సినిమా సలార్ గానే నిలుస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. టీజర్ తోనే ఇండస్ట్రీని షేక్ చేసిన సల్లార్ సినిమాతో ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టబోతుందో చూద్దాం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news