Moviesనాన్న అంటే నారా బ్రాహ్మణికి ఎంత ప్రేమో చూడండి.. బాలయ్య కోసం...

నాన్న అంటే నారా బ్రాహ్మణికి ఎంత ప్రేమో చూడండి.. బాలయ్య కోసం ఇప్ప‌టికి అలాంటి పని చేస్తుంది తెలుసా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న టాలీవుడ్ నందమూరి నట సిం హం బాలయ్య పేరు చెప్పగానే జనాల్లో కళ్ళల్లో వచ్చే ఆనందం ఆ పేరు చెప్తే వచ్చే కిక్కు .. మరో హీరో పేరు చెప్పినా రానే రాదు అని చెప్పాలి . అంతటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నారు నందమూరి బాలయ్య . ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్న బాలయ్య త్వరలోనే మెగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యారు . కాగా ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్న బాలయ్య ఫ్యామిలీ పరంగా కూడా టైం స్పెండ్ చేస్తూ కూతురలతో కొడుకుతో సరదాగా గడుపుతున్నారు . రీసెంట్ గానే అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేసి వచ్చిన బాలయ్య మళ్ళీ భగవంత్ కేసరి సినిమా షూట్ లో పాల్గొన్నారు.

ఇలాంటి క్రమంలోనే బాలయ్య కూతురు నారా బ్రాహ్మణి బాలయ్య పుట్టినరోజుకు ఏం చేస్తుంది అనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎవరైనా సరే ప్రజెంట్ ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలు బర్త డే అంటే ముందుగా పార్టీ అంటారు ..పబ్బులకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు .. లక్షలకు లక్షలు తగిలేసి మందులు తాగుతూ ఉంటారు . అయితే నారా బ్రాహ్మణి అందుకు పూర్తి వ్యతిరేకం.. తన తండ్రి పుట్టిన రోజుకు 1000 మందికి పైగా పేద పిల్లలకు అనాధ పిల్లలకు కడుపునిండా భోజనం పెడుతుంది . మంచి బట్టలు అందజేస్తుంది .

అలాంటి ఓ మంచి మనసు కలిగిన అమ్మాయి నారా బ్రాహ్మణి. కేవలం బాలయ్య పుట్టినరోజుకే కాదు తన అమ్మగారు వసుంధర పుట్టినరోజు కూడా అలాగే చేస్తుందట. అది మొదటి నుంచి బ్రాహ్మణికి అలవాటు. చదువుకునే టైంలో కూడా తన దగ్గర ఉన్న డబ్బులని మేకప్ లు.. బ్యూటీ పార్లర్ అంటూ ఖర్చు చేయకుండా ఎవరైనా సరే రోడ్డు పక్కన ఉన్న అనాధ పిల్లలకు ముసలి వాళ్లకు ఇచ్చేదట. అంత మంచి గొప్ప పెంపకంలో పెరిగింది బ్రాహ్మణి . అందుకే ఇప్పుడు అంతటి టాప్ పోజీషన్ లో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news