Newsఒక్క హిట్ తో దేవరకొండ రేంజే మారిపోయిందిగా.. ఇంటికి వచ్చి ఆఫర్...

ఒక్క హిట్ తో దేవరకొండ రేంజే మారిపోయిందిగా.. ఇంటికి వచ్చి ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రిలో లెక్కలు మారిపోతున్నాయి . భారీ భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తెరకెక్కిస్తున్న ఆ సినిమాలు పెట్టిన దానికి ఒక్క రూపాయి కూడా రావడం లేదు . అయితే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన చిన్న సినిమాలకు మాత్రం కోట్లకు కోట్లు లాభాలు వచ్చేస్తున్నాయి. పెట్టిన దానికి ఏకంగా నాలుగైదు రెట్లు లాభాలు తీసుకొస్తున్నాయి చిన్న సినిమాలు . అలాగే రీసెంట్గా హిట్ కొట్టిన సినిమా “బేబీ” .

సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది . కాగా బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ కలెక్షన్స్ సాధిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 71 కోటి దాటేసింది.పలు క్రేజీ రికార్డులను సైతం తుక్కుతుక్కు చేసేసింది .

ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ రేంజ్ మొత్తం మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ఈయనతో సినిమాలు చేసేదానికి ఇంట్రెస్ట్ లేని డైరెక్టర్లు ఇప్పుడు ఏకంగా ఇంటికి వచ్చి ప్రాజెక్టులపై సైన్ చేయించుకొని మరి వెళ్తున్నారట. ఆనంద్ దేవరకొండ నెక్స్ట్ మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మారుతి ఆనంద్ దేవరకొండకు స్క్రిప్ట్ వివరించగా విజయ్ కూడా ఇంప్రెస్ అయిపోయారట . అంతేకాదు ఆనంద్ దేవరకొండ ఇంటికి వచ్చి మరి అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేయించుకున్నారట . ఒకప్పుడు ఈయన డైరెక్టర్ చుట్టూరూ అవకాశం ఇవ్వండి అంటూ తిరిగేవారు ..బేబీ సినిమా తర్వాత డైరెక్టర్ లే వచ్చి తిరుగుతున్నారు అంటే ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా మారిపోతాయో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news