Newsఅన్న విజయ్‌ దేవరకొండ క్రేజీ రికార్డుని బద్దలు కొట్టిన తమ్ముడు ఆనంద్‌...

అన్న విజయ్‌ దేవరకొండ క్రేజీ రికార్డుని బద్దలు కొట్టిన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ.. సినీ చరిత్రలోనే మరో సంచలనం..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే బేబీ సినిమాకి సంబంధించిన టాక్ వైరల్ గా మారింది . సాయి రాజేష్ దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా బేబీ . ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది . కాగా ఫుల్ రొమాంటిక్ గా తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుంది .

ఈ నెల 24న విడుదలైన ఈ సినిమా రిలీజై సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుంది. మరీ ముఖ్యంగా యువత ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయింది . అందుకే ఈ సినిమా ఏకంగా 70 కోట్లు కలెక్ట్ చేసేలా చేసారు. ఈ స్థాయి రికార్డులు కొల్లగొట్టడం చాలా రేర్ . పెద్ద పెద్ద హీరోలే ఈ స్థాయి రికార్డులను దాటుకోలేకపోతున్నారు . అలాంటిది ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజై దాదాపు 74 కోట్ల గ్రాస్ ని దాటేసింది . అంటే 40 కోట్ల నెట్ సాధించింది అనమాట . ఈ లెక్కలు చూసుకుంటే పెట్టిన దానికి ఏకంగా మూడు రెట్లు అధికంగా వసూలు సాధించింది అని చెప్పొచ్చు.

అంతేకాదు రీసెంట్ గా ఈ సినిమా అన్న విజయ్ దేవరకొండ కెరీర్ లోనే సూపర్ హిట్ సినిమా అర్జున్ రెడ్డి రికార్డులను బద్ధలు కొట్టింది. మెడికో లవ్‌ స్టోరీ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. అత్యంత బోల్డ్ ఫిల్మ్ గా నిలిచింది. బ్లాక్ బస్టర్‌ హిట్‌ అయ్యింది. అప్పట్లోనే ఇది యాభై కోట్లు వసూలు చేసింది. యాభై కోట్ల ఫిల్మ్ అంటే ఆ టైమ్‌లో పెద్ద రికార్డుగానే పరిగనిస్తున్నారు. ఈ సినిమా రికార్డులు బద్ధలు కొట్టింది బేబి.

మరి ముఖ్యంగా ఈ సినిమాని తెరకెక్కించేటప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ చాలా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదుర్కున్నారని తెలుస్తుంది . అవన్నీ ఒక దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయి.. వాళ్ళ ఆకలి తీర్చేసింది బేబీ సినిమా . ఒక్క హిట్ కోసం కాపు కాసిన ఆనంద్ దేవరకొండకు బ్రిగ్ బేక్ ఇచ్చిందని చెప్పాలి . విజయ్ దేవరకొండ రికార్డులను బద్దలు కొట్టాడు ఆనంద్ దేవరకొండ. చూడాలి మరి ఈ సినిమా తరువాత ఆనంద్ ఎలాంటి సినిమాతో మన ముందుకు రాబోతున్నాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news